
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola గ్లోబల్ మార్కెట్ లో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Moto G04s పేరుతో వచ్చిన ఈ డివైజ్ ఎంట్రీ లెవెల్ కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చారు. మోటో జీ04ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో 4జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి Moto G04s యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.
Moto G04s ధర, కలర్ ఆప్షన్స్
Moto G04s స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. రూ.10,000 శ్రేణిలో ఈ ఫోన్ ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. మోటో జీ04ఎస్ డివైజ్ కాన్‌కార్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ మరియు సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Moto G04s స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Moto G04s స్మార్ట్‌ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
- ప్రాసెసర్: Moto G04s లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు. ఇది ఎంట్రీ లెవెల్ ఫోన్లలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ చిప్ యొక్క మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 1.6Ghz.
- మెమొరీ: Moto G04s డివైజ్ 4జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 4జిబి వర్చువల్ ర్యామ్ కూడా అందించారు. దీంతో యూజర్ కి 8జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్ 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
- బ్యాటరీ: Moto G04s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Moto G04s లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, బ్లూటూత్ 5.0, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ స్పీకర్, వాటర్-రిపెల్లెంట్ డిజైన్ ఉన్నాయి.











