
Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో ఒక కొత్త సిరీస్ లాంచ్ కానుంది. Turbo పేరుతో ఈ సిరీస్ లాంచ్ అవుతోంది. ముందుగా ఈ లైనప్ లో Redmi Turbo 3 ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. నేడు, రెడ్మీ కంపెనీ ఈ డివైజ్ యొక్క లాంచ్ తేదీని ప్రకటించింది. Redmi Turbo 3 ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 200ఎంపి ఓఐఎస్ కెమెరాతో లాంచ్ అవుతోంది. ఓసారి లాంచ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Redmi Turbo 3 లాంచ్ వివరాలు
Redmi Turbo 3 స్మార్ట్ఫోన్ చైనాలో ఏప్రిల్ 10వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ అదే రోజున రాత్రి 7 గంటలకు ప్రకటించనున్నారు.
భారత కాలమానం ప్రకారం, సాయంత్రం 4.30 గంటలకు ఈ ఫోన్ లాంచ్ ఉంటుంది. ముందుగా చైనాలో మాత్రమే ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. తర్వాత భారత్ లో కూడా లాంచ్ అవుతుంది. ఇండియా లాంచ్ వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
Redmi Turbo 3 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi Turbo 3 లో 6.67-ఇంచ్ స్క్రీన్, 1220 పిక్సెల్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- కెమెరా: Redmi Turbo 3 లో 200ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఓఐఎస్ ఫీచర్ తో వస్తోంది.
- మెమొరీ: Redmi Turbo 3 డివైజ్ 16జిబి ర్యామ్ సపోర్ట్ తో వస్తోంది. 12జిబి ర్యామ్ వేరియంట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 512జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
- బ్యాటరీ: Redmi Turbo 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.











