Redmi: స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్‌తో చైనాలో లాంచైన Turbo 3

Highlights

  • చైనాలో Redmi Turbo 3 లాంచ్
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 20ఎంపి ఫ్రంట్ కెమెరా

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి కొత్తగా Turbo సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో భాగంగా Redmi Turbo 3 డివైజ్ చైనాలో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. రెడ్మీ టర్బో 3 లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ, 20ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి రెడ్మీ టర్బో 3 యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Redmi Turbo 3 ధర

Redmi Turbo 3 స్మార్ట్‌ఫోన్ చైనాలో 4 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

రెడ్మీ టర్బో 3 యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ.23,044) గా ఉంది.

రెడ్మీ టర్బో 3 యొక్క 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 2,299 (సుమారు రూ.26,499) గా ఉంది.

రెడ్మీ టర్బో 3 యొక్క 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,499 (సుమారు రూ.29,349) గా ఉంది.

రెడ్మీ టర్బో 3 యొక్క 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ టాప్ మోడల్ ధర CNY 2,799 (సుమారు రూ.32,263) గా ఉంది.

Redmi Turbo 3 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Turbo 3 లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, అల్ట్రా-థిన్ బెజెల్స్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Turbo 3 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. హై క్లాక్ స్పీడ్ 3GHz.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Turbo 3 డివైజ్ 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ మొత్తం 4 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Redmi Turbo 3 లో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 20ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Redmi Turbo 3 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: రెడ్మీ టర్బో 3 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: రెడ్మీ టర్బో 3 లో డ్యూయల్ సిమ్, 5జీ, యూఎస్బీ-సీ పోర్ట్, వై-ఫై 7, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.
Previous articleSamsung Galaxy A05 ఫోన్ ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి
Next articleRealme: 100W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన GT Neo 6 SE
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.