
Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి 2022 లో Redmi Pad లాంచ్ అయ్యింది. తాజాగా ఈ ట్యాబ్లెట్ ధరను కంపెనీ తగ్గించింది. ఇకపై రూ.2,000 తక్కువకే Redmi Pad ప్రస్తుతం లభించనుంది. రెడ్మీ ప్యాడ్ ట్యాబ్లెట్ యొక్క పాత ధర, తగ్గింపు తర్వాత ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Redmi Pad ధర
Redmi Pad ట్యాబ్లెట్ రెండు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi Pad 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.14,999 గా ఉంది. ప్రస్తుతం రూ.2,000 తగ్గింపు తర్వాత రూ.12,999 కి లభించనుంది.
Redmi Pad 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.16,999 ఉండగా, రూ.2,000 తగ్గింపు తర్వాత రూ.14,999 కి లభించనుంది.
Redmi Pad ట్యాబ్లెట్ గ్రాఫైట్ గ్రే, మింట్ గ్రీన్ మరియు మూన్‌లైట్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Redmi Pad స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Redmi Pad ట్యాబ్లెట్ లో 15:9 యాస్పెక్ట్ రేషియో, 10.61-ఇంచ్ 2కే స్క్రీన్, 2000*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Redmi Pad లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్.
ర్యామ్, స్టోరేజీ: Redmi Pad ట్యాబ్లెట్ 4జిబి/6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
కెమెరా: Redmi Pad లో 8ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
బ్యాటరీ: Redmi Pad లో పవర్ బ్యాకప్ కోసం 8000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Redmi Pad లో వై-ఫై 5, బ్లూటూత్ 5.3, క్వాడ్ స్పీకర్స్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
బరువు, మందం: రెడ్మీ ప్యాడ్ ట్యాబ్లెట్ 7.05 మి.మీ మందం, 465 గ్రాముల బరువు ఉంటుంది.











