
Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి తాజాగా Redmi Note 13 Pro+ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ లాంచ్ అయ్యింది. అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో కలిసి ఈ స్పెషల్ ఎడిషన్‌ని షావోమి తీసుకొచ్చింది. బ్రాండ్ తన పదేళ్ళ యానివర్శరీని పురస్కరించుకుని స్పెషల్ ఎడిషన్‌ని లాంచ్ చేసింది. బ్లూ కలర్ లో వచ్చిన ఈ ఫోన్ ఆకట్టుకునే డిజైన్ ప్యాటర్న్ లో కనిపిస్తోంది. ఓసారి డివైజ్ ధర మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Redmi Note 13 Pro+ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ ధర, లభ్యత
Redmi Note 13 Pro+ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.34,999 గా ఉంది.
మే 15వ తేదీ నుంచి ఫ్లిప్కార్, అమెజాన్, ఎంఐ.కామ్, షావోమి స్టోర్స్ ద్వారా ఈ డివైజ్‌ని కొనుగోలు చేయవచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా ఫోన్ కొంటే రూ.3,000 డిస్కౌంట్ లేదా సేల్ సమయంలో రూ.3,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తాయి.
Redmi Note 13 Pro+ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Redmi Note 13 Pro+ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ లో 6.67-ఇంచ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ ఉంది.
ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ లో 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ఉన్నాయి.
కెమెరా: Redmi Note 13 Pro+ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పి3 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: Redmi Note 13 Pro+ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14.3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro+ లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్సీ, డాల్బీ అట్మాస్, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.











