రూ.30,000 లోపే లభించనున్న Motorola Edge 50 Pro; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights

  • ఏప్రిల్ ఆరంభంలో Motorola Edge 50 Pro లాంచ్
  • భారత్ లో లాంచ్ ధర రూ.31,999
  • ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ధర రూ.30,000 లోపే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఈ నెల ఆరంభంలో Motorola Edge 50 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. రూ.31,999 ధరతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. అయితే ఈ ఫోన్‌ని ఇప్పుడు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా Motorola Edge 50 Pro డివైజ్ రూ.30,000 లోపు ధరకే లభించనుంది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Motorola Edge 50 Pro ఆఫర్ వివరాలు

Motorola Edge 50 Pro డివైజ్ ని ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా రూ.27,999 కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను కలుపుకుని ఈ ధరకి లభిస్తుంది. హ్యాండ్సెట్ అసలు ధర రూ.31,999 (8జిబి+256జిబి) గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ అసలు ధర రూ.35,999 గా ఉంది.

Motorola Edge 50 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Edge 50 Pro లో 6.7-ఇంచ్ స్క్రీన్, 1.5కే పీఓఎల్ఈడీ కర్వ్డ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: Motorola Edge 50 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 Pro డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.

ఓఎస్: Motorola Edge 50 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 17 వరకు ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి వస్తాయి.

బ్యాటరీ: Motorola Edge 50 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 125 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Pro డివైజ్ లో డాల్బీ అట్మాస్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ రెసిస్టన్స్ ఉన్నాయి.

Previous articleభారత్‌లో లాంచైన Redmi Note 13 Pro+ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్
Next articleVivo: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Vivo Y36s
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.