
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung 2024 ఆరంభంలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ S24 లాంచ్‌కి ముందు గెలాక్సీ ఎస్23 ధరను తగ్గించింది. అప్పుడు ఒకేసారి రూ.10,000 తగ్గించింది. దీంతో ఫోన్ ధర రూ.64,999 కి చేరింది. ఇప్పుడు మరోసారి Samsung Galaxy S23 డివైజ్ ధర ఆఫర్ డిస్కౌంట్ తో భారీగా తగ్గింది. ఓసారి శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఆఫర్ ధర మరియు సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy S23 ఆఫర్ వివరాలు
శాంసంగ్ సంస్థ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ తో చేతులు కలిపి తన ఫ్లాగ్షిప్ Samsung Galaxy S23 ని స్పెషల్ సేల్‌కి తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా Samsung Galaxy S23 పై భారీ డిస్కౌంట్ లభించనుంది. రూ.64,999 విలువగల Samsung Galaxy S23 డివైజ్‌ని రూ.44,999 కి సొంతం చేసుకోవచ్చు. అంటే రూ.20,000 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట.

Samsung Galaxy S23 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy S23 లో 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Samsung Galaxy S23 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు.
ఓఎస్: Samsung Galaxy S23 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరా: Samsung Galaxy S23 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: Samsung Galaxy S23 లో పవర్ బ్యాకప్ కోసం 3,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Samsung Galaxy S23 లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, 5జీ, ఎల్టీఈ, వై-ఫై 6ఈ, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 5.3, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











