Vivo: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Vivo Y36s

Highlights

  • త్వరలో Vivo Y36s లాంచ్
  • మోడల్ నంబర్ PD2318
  • డైమెన్సిటీ 700 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా వివో వై18ఈ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. మరోవైపు, వై-సిరీస్ లో మరొక డివైజ్ ని కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y36s పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్ ద్వారా ఫోన్‌కి సంబంధించిన ఎన్నో వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Vivo Y36s గూగుల్ ప్లే కన్సోల్ వివరాలు

Vivo Y36s డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై PD2318 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ పై Vivo Y36s 6జిబి ర్యామ్ తో కనిపించింది. దీంతో పాటు మరొక వేరియంట్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

సర్టిఫికేషన్ లిస్టింగ్ పై MediaTek MT6833 అనే చిప్సెట్ కనిపించింది. ఇది డైమెన్సిటీ 700 చిప్‌ యొక్క కోడ్ నేమ్ అని తెలుస్తోంది.

Vivo Y36s లో గ్రాఫిక్స్ కోసం ARM Mali G57 GPU వాడినట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo Y36s స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ ద్వారా 720*1612 రెజుల్యూషన్ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్ ఫీచర్స్ రివీల్ అయ్యాయి.

Vivo Y36 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y36 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, పంచ్ హోల్ నాచ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y36 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Vivo Y36 5G లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Vivo Y36 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y36 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo Y36 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y36 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.