OnePlus 11R, Nord CE 4 లపై డిస్కౌంట్; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights

  • అమెజాన్ సేల్‌లో వన్‌ప్లస్ ఫోన్లపై డిస్కౌంట్
  • మే 2 నుంచి సేల్ ప్రారంభం
  • OnePlus 11R, Nord CE 4 లపై డీల్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus ఉత్పత్తులకు భారత్‌లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. తాజాగా వన్‌ప్లస్ లవర్స్‌కి శుభవార్త వచ్చేసింది. OnePlus 11R, OnePlus Nord CE 4 ఫోన్లపై ఆకట్టుకునే డీల్స్‌ని వన్‌ప్లస్ తీసుకొచ్చింది. మే 2 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో ఈ ఫోన్లపై డిస్కౌంట్ లభించనుంది. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus 11R, Nord CE 4 ఆఫర్లు

OnePlus 11R డివైజ్ 2023 లో 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ రూ.39,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం విక్రయ ధర రూ.35,999 గా ఉంది. బ్యాంక్ ఆఫర్ల తర్వాత ఈ ఫోన్ రూ.29,999 కే లభించనుంది. అంతేకాదు, 6 నెలల కాలపరిమితి మరియు నెలకు రూ.5,000 కనీస చెల్లింపుతో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది.

OnePlus Nord CE 4 డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ లాంచ్ ధర రూ.24,999 గా ఉంది. సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లతో కలుపుకుని, ఈ ఫోన్‌ని రూ.22,999 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, 6 నెలల కాలపరిమితి మరియు నెలకు రూ.3,833 కనీస చెల్లింపుతో నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్ అందుబాటులో ఉంది.

OnePlus 11R స్పెసిఫికేషన్స్

OnePlus 11R స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 8జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

OnePlus Nord CE 4 స్పెసిఫికేషన్స్

OnePlus Nord CE 4 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 256జిబి వరకు స్టోరేజీ, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఆక్సిజన్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ ఉన్నాయి.

OnePlus Nord CE 4 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఆక్వాటచ్ టెక్నాలజీ ఉన్నాయి.

Previous articleVivo: వై-సిరీస్ ఫోన్ల ధరను తగ్గించిన వివో
Next articleInfinix GT 20 Pro ఇండియా లాంచ్ ఖరారు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.