Infinix GT 20 Pro ఇండియా లాంచ్ ఖరారు

Highlights

  • త్వరలో Infinix GT 20 Pro లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Infinix తాజాగా GT 20 Pro యొక్క టీజర్ ని షేర్ చేసింది. దీంతో ఇండియా లాంచ్ ఖరారైంది. ఈ గేమింగ్-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్స్ లో సైబర్ మెకా డిజైన్‌తో లాంచ్ అయ్యింది. Infinix GT 20 Pro డివైజ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో వస్తోంది. ఓసారి ఈ ఫోన్ యొక్క కొత్త టీజర్ విశేషాలు, ఇండియా లాంచ్ టైమ్‌లైన్ గురించి తెలుసుకుందాం.

Infinix GT 20 Pro ఇండియా లాంచ్ వివరాలు

ఇన్ఫినిక్స్ బ్రాండ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై GT సిరీస్ ఫోన్ త్వరలో భారత్‌కి రాబోతోందని టీజర్ షేర్ చేసింది. అలాగే ఇన్ఫినిక్స్ ఇండియా వెబ్‌సైట్ పై ఒక మైక్రోసైట్ కూడా దర్శనమిస్తోంది. దీంతో Infinix GT 20 Pro ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. త్వరలోనే లాంచ్ తేదీ వెల్లడవ్వనుంది.

Infinix GT 20 Pro స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Infinix GT 20 Pro లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2340 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1300 నిట్స్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix GT 20 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.1GHz.

ర్యామ్, స్టోరేజీ: Infinix GT 20 Pro డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 12జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Infinix GT 20 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Infinix GT 20 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. పీడీ 3.0 మరియు హైపర్ చార్జ్ మోడ్ అనేవి ఈ ఫోన్ లో ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Infinix GT 20 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై 6, ఐఆర్ బ్లాస్టర్, ఐపీ54 రేటింగ్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.