Realme GT సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు

Highlights

త్వరలో రియల్మీ జీటీ సిరీస్ లాంచ్

అధికారికంగా ప్రకటించిన రియల్మీ

భారత్‌కి రానున్న GT Neo 6/Neo 6 SE

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ తొలుత చైనాలో లాంచ్ అవ్వనుంది. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే భారత్ లో ఈ సిరీస్ లాంచ్ అవుతుందా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. తాజాగా, రియల్మీ సంస్థ Realme GT సిరీస్ ను భారత్ లో కూడా లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో రియల్మీ లవర్స్‌కి శుభవార్త చెప్పినట్లైంది. Realme GT Neo 6 లేదా GT Neo 6 SE భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Realme GT సిరీస్ ఇండియా లాంచ్

Realme GT సిరీస్ ఇండియా లాంచ్‌ని రియల్మీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. మే నెలలో ఈ సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారత్ లో ఏ ఫోన్‌ని లాంచ్ చేయనున్నారో రియల్మీ ఇంకా తెలపలేదు. Realme GT Neo 6 లేదా Realme GT Neo 6 SE ఫోన్లలో ఒకటి లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Realme GT Neo 6 స్పెసిఫికేషన్స్

Realme GT Neo 6 ఈ వారంలో చైనాలో లాంచ్ అవ్వబోతోంది. చైనాలో లాంచైన తర్వాత భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని స్పెసిఫికేషన్స్‌ని కంపెనీ రివీల్ చేసింది. ఓసారి అవెలా ఉన్నాయో చూద్దాం.

ప్రాసెసర్: Realme GT Neo 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3GHz.

మెమొరీ: Realme GT Neo 6 1టిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. ఈ మోడల్ 16జిబి ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది. మరొక వేరియంట్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తోంది.

చార్జింగ్: Realme GT Neo 6 డివైజ్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు.

Previous articleOPPO: బీఐఎస్‌పై లిస్టైన Reno 12 Pro, త్వరలో భారత్‌లో లాంచ్
Next articleMotorola Edge 50 Fusion ఇండియా లాంచ్ తేదీ ఖరారు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.