Motorola Edge 50 Fusion ఇండియా లాంచ్ తేదీ ఖరారు

Highlights

  • మే 16న Motorola Edge 50 Fusion లాంచ్
  • 15 5జీ బ్యాండ్స్ సపోర్ట్ తో వస్తోన్న ఫోన్
  • ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఎడ్జ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Motorola Edge 50 Fusion పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని తాజాగా ఖరారు చేసింది. మే 16న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్ సేల్‌కి రానుంది. ఓసారి లాంచ్ తేదీ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Motorola Edge 50 Fusion లాంచ్ తేదీ

ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ప్రకారం, Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ భారత్ లో మే 16న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవ్వనుంది.

Motorola Edge 50 Fusion ఫారెస్ట్ బ్లూ, మార్ష్‌మాలో బ్లూ మరియు హాట్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

మార్ష్‌మాలో బ్లూ మరియు హాట్ పింక్ కలర్స్ వీగన్ లెదర్ ఫినిష్డ్ బ్యాక్ ప్యానెల్ తో వస్తున్నాయి. మరోవైపు, ఫారెస్ట్ బ్లూ పీఎంఎంఏ ఫినిష్ తో రానుంది.

Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే గ్లోబల్‌గా లాంచ్ అయ్యింది. దీంతో దాదాపుగా డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ గ్లోబల్ వేరియంట్‌ని పోలి ఉంటాయని భావిస్తున్నారు.

Motorola Edge 50 Fusion స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Edge 50 Fusion లో 6.7-ఇంచ్ 3డీ కర్వ్డ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 Fusion లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 Fusion డివైజ్ 12జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Motorola Edge 50 Fusion డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ 700సీ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ 4x మ్యాక్రో షాట్స్‌ని కూడా తీయగలదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Motorola Edge 50 Fusion లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Motorola Edge 50 Fusion డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్‌ ఈ ఫోన్ కి లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Fusion డివైజ్ 15 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ కూడా ఉంది.