లీకైన Samsung Galaxy Z Flip 4 ధర

హైలైట్స్:

  • లాంచ్ కి ముందు లీకైన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 యూరప్ మార్కెట్ ధర
  • 128జిబి మోడల్ ధర 1080 యూరోలు (దాదాపు రూ.87,900). 512జిబి మోడల్ ధర 1280 యూరోలు (దాదాపు రూ.1,04,200)
  • ఆగస్టు 10 న లాంచ్ అవుతోన్న శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఆగస్టు 10 న అన్ ప్యాక్డ్ ఈవెంట్ లో లాంచ్ కానున్నాయి. గతేడాది వచ్చిన గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3, జెడ్ ఫోల్డ్ 3 ఫోన్లకు సక్సెసర్స్ గా ఈ ఫోన్స్ వస్తున్నాయి. రాబోవు ఈ మడత ఫోన్లకు సంబంధించి ఎన్నో వార్తలు, రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రైస్ బాబా వెబ్ సైట్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 యురోపియన్ మార్కెట్ ధరను లీక్ స్టర్ సుదాన్శు సౌజన్యంతో ప్రకటించింది. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ధర, జెడ్ ఫ్లిప్ 3 ధర మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్సెట్, అమోలెడ్ డిస్ప్లే ఉండనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ కి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy Z Flip 4 ధర (అంచనా)

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 128జిబి వేరియంట్ ధరను 1080 యూరోలుగా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీలో దీని ధర రూ.87,900. ఇక 256జిబి వేరియంట్ ధర 1160 యూరోలు (రూ.94,400) గా ఉండనుంది. 512జిబి వేరియంట్ ధర 1280 యూరోలు (రూ.1,04,200) గా ఉంటుందని సమాచారం. భారత మార్కెట్ లో ఈ ఫోన్ ధర వేరుగా ఉండే అవకాశముంది. మరి ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూద్దాం రండి.

Samsung Galaxy Z Flip 4 స్పెసిఫికేషన్స్ (అంచనా)

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 లో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది మధ్యలోకి ఫోల్డ్ అవుతుంది. ఇక ఫోల్డ్ అయ్యాక మనకు 1.9 అంగుళాల సెకండరీ అమోలెడ్ డిస్ప్లే కనిపిస్తుంది. మెయిన్ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉండి, సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ని కలిగి ఉండనుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 512జిబి వరకు స్టోరేజీ, 12జిబి వరకు ర్యామ్ ఈ ఫోన్లో ఉంటాయి. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 లో 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉంటాయి. వీటిలో ఒకటి 50ఎంపి ప్రైమరీ సెన్సర్ కాగా, రెండోది 12ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, ఇక మూడోది 10ఎంపి టెలీఫోటో లెన్స్ (3X జూమ్). 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి.