
ప్రముఖ టెక్ బ్రాండ్ Sony తాజాగా ఒక మిడ్-బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. Sony Xperia 10 VI పేరుతో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ డివైజ్ యూరప్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ లో 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 8జిబి ర్యామ్, 48ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Sony Xperia 10 VI ధర
Sony Xperia 10 VI స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో వచ్చింది. ఈ ఫోన్ ధర 399 యూరోలు (సుమారు రూ.36,075) గా ఉంది.
Sony Xperia 10 VI డివైజ్ బ్లాక్, వైట్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Sony Xperia 10 VI స్మార్ట్‌ఫోన్ యూరప్ లో ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది. జూన్ 10 నుంచి ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది.
Sony Xperia 10 VI స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Sony Xperia 10 VI లో 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ (2520*1080 పిక్సెల్స్) స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 21:9 యాస్పెక్ట్ రేషియో, 97% డీసీఐ-పీ3 టెక్నాలజీ, 10-బిట్ టోనల్ గ్రేడేషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
ప్రాసెసర్: Sony Xperia 10 VI లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి. ఈ చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz.
ర్యామ్, స్టోరేజీ: Sony Xperia 10 VI లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ఓఐఎస్/ఈఐఎస్ మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: Sony Xperia 10 VI లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: Sony Xperia 10 VI డివైజ్ ఆం్డరాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్‌కి 3 మేజర్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
కనెక్టివిటీ: Sony Xperia 10 VI లో 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ 2.0 టైప్ సీ పోర్ట్ ఉన్నాయి.











