iQOO Z9x 5G: ఐపీ64 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన ఐకూ కొత్త ఫోన్

Highlights

  • iQOO Z9x 5G భారత్‌లో లాంచ్
  • 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి నేడు భారతీయ మార్కెట్ లో iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. తక్కువ బడ్జెట్ లో వచ్చిన ఈ ఫోన్ యూజర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఐకూ జీ9ఎక్స్ 5జీ డివైజ్ 6.72-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 339 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Z9x 5G ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

iQOO Z9x 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.12,999 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.15,999 గా పెట్టారు.

iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ టొర్నాడో గ్రీన్ మరియు స్టార్మ్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఐకూ జీ9ఎక్స్ 5జీ మే 21వ తేదీన అమెజాన్ ఇండియా మరియు ఐకూ ఈషాప్ ద్వారా సేల్‌కి వస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ మరియు ఎస్బీఐ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి ఫోన్‌ని కొంటే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, 6జిబి/8జిబి ర్యామ్ వేరియంట్స్ పై రూ.500 కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

iQOO Z9x 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: iQOO Z9x 5G లో 6.72-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (2408*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1400:1 కాంట్రాస్ట్ రేషియో, 339 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.48% స్క్రీన్-టు-బాడీ రేషియో, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: iQOO Z9x 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9x 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

సాఫ్ట్‌వేర్: iQOO Z9x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: iQOO Z9x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి S5KJNSSQ33 ప్రైమరీ సెన్సర్ (f/1.8 అపర్చర్), 2ఎంపి బొకే కెమెరా (f/2.4 అపర్చర్), ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం f/2.05 అపర్చర్ గల 8ఎంపి సెన్సర్ ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: iQOO Z9x 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: iQOO Z9x 5G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, జీఎన్ఎస్ఎస్, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ 2.0 టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.