హైలైట్స్:
- నేడు భారత్ లో మొదలైన నథింగ్ ఫోన్ (1) ఓపెన్ సేల్
- ఫ్లిప్ కార్ట్ ద్వారా సాగనున్న అమ్మకాలు, ఫోన్ ధర రూ.32,999 నుంచి ప్రారంభం
- జులై 27 న ప్రీ-ఆర్డర్ కస్టమర్ల కోసం స్పెషల్ సేల్ నిర్వహించనున్న నథింగ్
2022 లో లాంచ్ అయిన మోస్ట్ అవెయిటెడ్ ఫోన్స్ లో ఒకటి నథింగ్ ఫోన్ (1). నేడు ఓపెన్ సేల్ కి వచ్చింది. ఆసక్తిగల కొనుగోలుదారులు నథింగ్ ఫోన్ (1) ని ఫ్లిప్ కార్ట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఫ్యాన్స్ నేటి నుంచి ఫోన్ ని కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్న వేళ, ప్రీ-ఆర్డర్ కస్టమర్లు మాత్రం ఫోన్ షార్టేజీ వల్లన ఇంకా తమ ఆర్డర్ ను ప్లేస్ చేయలేకపోతున్నారు. దీంతో నథింగ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ మను శర్మ, ప్రీ-ఆర్డర్ కస్టమర్ల కోసం స్పెషల్ సేల్ ను నిర్వహించబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా
ప్రకటించారు.
ప్రీ-ఆర్డర్ పాస్ డబ్బులను ప్రీ-ఆర్డర్ కస్టమర్లకు జులై 23 న ఇవ్వబోతున్నట్లు లేఖ ద్వారా స్పష్టమవుతోంది. అలాగే నేటి నుంచే ప్రీ-ఆర్డర్ కస్టమర్ తమకు నచ్చిన వేరియంట్ ను ఆర్డర్ పెట్టుకోవచ్చని, జులై 27 మధ్యాహ్నం 12 తర్వాత పూర్తి పేమెంట్ చేయొచ్చని లేఖలో పేర్కొన్నారు. ప్రీ-ఆర్డర్ కస్టమర్లకు అన్ని రకాల ఆఫర్లు, బెనిఫిట్స్ అందుతాయని కంపెనీ భరోసా ఇచ్చింది.
To all the pre-order pass holders, we would like to sincerely apologise for the experience and delays in getting your hands on Phone (1).
We will be hosting a special sale on @Flipkart for you on 27 July at 12 noon. pic.twitter.com/wKdEqZQxlz
— Manu Sharma (@buildingnothing) July 21, 2022
పాస్ లేకుండా భారత్ లో Nothing Phone (1) ధర
నథింగ్ ఫోన్ (1) మూడు వేరియంట్లలో లభిస్తుంది:
- 8జిబి/128జిబి: రూ.32,999
- 8జిబి/256జిబి: రూ.35,999
- 12జిబి/256జిబి: రూ.38,999
నథింగ్ ఫోన్ (1) తెలుపు మరియు నలుపు రంగు ఆప్షన్స్ లో లభిస్తుంది. నథింగ్ ఫోన్ (1) ఓపెన్ సేల్ నేడు ఫ్లిప్ కార్ట్ లో 7 గంటలకు మొదలైంది. ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింద, కంపెనీ నుంచి రూ.1000 డిస్కౌంట్ లభిస్తోంది. హెచ్డీఎఫ్సీ కార్డ్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్ లభించనుంది.
Nothing Phone (1) స్పెసిఫికేషన్స్
నథింగ్ ఫోన్ (1) బ్యాక్ ప్యానెల్ పై 900 ఎల్ఈడీ లతో గ్లైఫ్ ఇంటర్ఫేస్ ఉంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్సెట్ కలిగి ఉంది. ఇందులో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. అయితే స్టోరేజీని పెంచుకునే అవకాశం లేదు.
6.55 అంగుళాల 10-బిట్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 402పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, హెచ్డీఆర్10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇక కెమెరా విభాగానికి వస్తే, నథింగ్ ఫోన్ (1) లో డ్యూయర్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఒకటి 50ఎంపి మెయిన్ కెమెరా (సోనీ సెన్సర్) కాగా, రెండోది 50ఎంపి (శాంసంగ్ సెన్సర్) అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందువైపున 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 సెన్సర్ ను అమర్చారు. ఇంకా ఈ ఫోన్లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. బ్లూటూత్, వై-ఫై 6, ఎన్ఎఫ్సీ, 5జీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేసియల్ రికగ్నిషన్, ఐపీ53 రేటింగ్, ఆండ్రాయిడ్ 12, నథింగ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లున్నాయి. ఇక అప్డేట్స్ విషయానికి వస్తే, నథింగ్ కంపెనీ ఈ ఫోన్ కి నాలుగేళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్, మూడేళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇవ్వనుంది.












