Redmi Note 13R 5G: 120Hz డిస్ప్లేతో చైనాలో లాంచైన రెడ్మీ కొత్త ఫోన్

Highlights

  • చైనాలో Redmi Note 13R 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్
  • 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి గతేడాది నవంబర్ నెలలో Note 13 సిరీస్ లో భాగంగా Redmi Note 13R Pro లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 108ఎంపి మెయిన్ కెమెరా, 12జిబి ర్యామ్ తో వచ్చింది. నేడు, చైనాలో మరొక ఫోన్ Redmi Note 13R 5G మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మిడ్-బడ్జెట్ ఫోన్ 120 హెర్ట్జ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 12జిబి ర్యామ్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Redmi Note 13R 5G ధర

Redmi Note 13R 5G స్మార్ట్‌ఫోన్ చైనాలో 5 వేరియంట్స్ లో లభించనున్నట్లు అధికార వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi Note 13R 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధరను 1399 యువాన్లు (సుమారు రూ.16,399) గా ఉంది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధరను 2199 యువాన్లు (సుమారు రూ.25,799) గా పెట్టారు.

Redmi Note 13R 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi Note 13R 5G లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 2460*1080 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi Note 13R 5G డివైజ్ లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3GHz.

మెమొరీ: Redmi Note 13R 5G డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Redmi Note 13R 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి అల్ట్రా-క్లియర్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi Note 13R 5G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi Note 13R 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ53 రేటింగ్ ఉన్నాయి.

Previous articleHONOR 200 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు
Next articleVivo Y28s సీక్యూసీ సర్టిఫికేషన్ వివరాలు; త్వరలో లాంచ్!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.