
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ HONOR నుంచి త్వరలో 200 సిరీస్ లాంచ్ కానుంది. ఇప్పటికే మార్కెట్ లో హానర్ 90-సిరీస్ కొనుగోలుకి మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు HONOR 200 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. మే 27న హానర్ 200 సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. ప్రస్తుతం, ఈ సిరీస్‌ని కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. హానర్ 200 సిరీస్ కలర్ ఆప్షన్స్, డిజైన్ వివరాల గురించి తెలుసుకుందాం.
HONOR 200 కలర్స్, డిజైన్
HONOR 200, HONOR 200 Pro 4 కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: బ్లాక్, పింక్, వైట్ మరియు బ్లూ.
HONOR 200 సిరీస్ ఫోన్లలో భారీ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. చూడటానికి అన్ని ఫోన్లు దాదాపుగా ఒకే విధమైన డిజైన్ తో ఉన్నాయి. కాకపోతే, ప్రో వేరియంట్ లో పిల్-షేప్డ్ నాచ్ ఉండగా, నార్మల్ వేరియంట్ లో పంచ్-హోల్ కటౌట్ ఉంది.
డివైజ్ కి కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో హానర్ బ్రాండింగ్ ఉంది.
HONOR 200 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: HONOR 200 సిరీస్ క్వాడ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్స్ తో వస్తోంది. రెండు ఫోన్లలో కూడా ఇదే తరహా డిస్ప్లే ఉంటుంది.
ప్రాసెసర్: HONOR 200 సిరీస్ లో ప్రో వేరియంట్ లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
కెమెరా: HONOR 200 సిరీస్ 50ఎంపి ఓఐఎస్ ఒమ్నివిజన్ ఓవి50హెచ్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీంతో పాటు 50ఎక్స్ టెలీఫోటో కెమెరా ఉంటుంది. 200 ప్రో వేరియంట్ లో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉంటుంది.
బ్యాటరీ, చార్జింగ్: HONOR 200, HONOR 200 Pro డివైజెస్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి. రెండు ఫోన్లలో 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
ఓఎస్: HONOR 200 సిరీస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవ్వనుంది.











