
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28s పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ CQC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ డివైజ్ తక్కువ బడ్జెట్ లో వస్తోందని సమాచారం. ఇప్పటికే మార్కెట్ లో Vivo Y28 5జీ అందుబాటులో ఉంటుంది. సరే, ఓసారి Vivo Y28s యొక్క సీక్యూసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం.
Vivo Y28s 5G సీక్యూసీ లిస్టింగ్
Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ సీక్యూసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని తొలుత Gizmochina వెబ్‌సైట్ గుర్తించింది.
Vivo Y28s 5G డివైజ్ సీక్యూసీ డేటాబేస్ పై V2346 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. అయితే ఈ ఫోన్ 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం.
Vivo Y28 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo Y28 5G లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
సెక్యూరిటీ: Vivo Y28 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.











