
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారత్‌లో కొత్త వై-సిరీస్ డివైజ్‌ని లాంచ్ చేసింది. Vivo Y200 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. Vivo Y200 Pro 5G డివైజ్ లో 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 16జిబి వరకు ర్యామ్, ఐపీ54 రేటింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Vivo Y200 Pro 5G ధర, లభ్యత
Vivo Y200 Pro 5G స్మార్ట్‌ఫోన్ సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది. ఓసారి ధర వివరాలు తెలుసుకుందాం.
Vivo Y200 Pro 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.24,999 గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్ లో భాగంగా హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ మరియు ఎస్బీఐ బ్యాంక్ కార్డ్స్ పై రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది. నేటి నుంచి మే 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
Vivo Y200 Pro 5G డివైజ్ సిల్క్ గ్రీన్ మరియు సిల్క్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Vivo Y200 Pro 5G సేల్ నేటి నుంచి మొదలవుతుంది.
Vivo Y200 Pro 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo Y200 Pro 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్, 3డీ కర్వ్డ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 2400 * 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo Y200 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఇది 5జీ చిప్సెట్. డివైజ్ ధరను బట్టి చూస్తే, ఈ చిప్సెట్ సరైనదేనని చెప్పవచ్చు. పెర్ఫామెన్స్ పరంగా, గేమింగ్ పరంగా ఈ చిప్సెట్ సరిపోతుంది.
ర్యామ్, స్టోరేజీ: Vivo Y200 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంది. వర్చువల్ ర్యామ్ ద్వారా యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
కెమెరా: Vivo Y200 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: Vivo Y200 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Vivo Y200 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, జీపీఎస్, ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.











