
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix నేడు భారతీయ మార్కెట్ లో Infinix GT 20 Pro 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. గేమర్స్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ని తీసుకొచ్చారు. ఈ ఫోన్ విభిన్నమైన లుక్ తో వచ్చింది. బ్యాక్ ప్యానెల్ పై మెకా డిజైన్ తో కూడిన ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్సెట్, 12జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Infinix GT 20 Pro 5G ధర, లభ్యత
Infinix GT 20 Pro 5G రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఓసారి వాటి ధరలు తెలుసుకుందాం.
Infinix GT 20 Pro 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.24,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది.
ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ మరియు ఎస్బీఐ బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఫోన్ కొంటే రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది.
మే 28 నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Infinix GT 20 Pro 5G ని కొనుగోలు చేయవచ్చు.
మెకా ఆరెంజ్, మెకా సిల్వర్ మరియు మెకా బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ తో రూ.5,499 విలువజేసే గేమింగ్ కిట్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది. ఈ కిట్ లో జీటీ మెకా కేస్, జీటీ కూలింగ్ ఫ్యాన్ మరియు జీటీ ఫింగర్ స్లీవ్స్ లభిస్తాయి. లాంచ్ ఆఫర్ లో భాగంగా పరిమిత కాలం పాటు వీటిని అందిస్తున్నారు.
Infinix GT 20 Pro 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Infinix GT 20 Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పిక్సెల్‌వర్క్స్ ఎక్స్5 టర్బో గేమింగ్ డిస్ప్లే చిప్సెట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Infinix GT 20 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: Infinix GT 20 Pro 5G లో 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ, వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.
కెమెరా: Infinix GT 20 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్ వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
ఓఎస్: Infinix GT 20 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
బ్యాటరీ: Infinix GT 20 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Infinix GT 20 Pro 5G లో ఐపీ54 రేటింగ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ సిమ్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











