Realme GT 6 ఇండియా లాంచ్ ఖరారు

Highlights

  • త్వరలో Realme GT 6 లాంచ్
  • అధికారికంగా ప్రకటించిన రియల్మీ
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme గత వారం జీటీ 6టీ డివైజ్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే సిరీస్ లో మరొక ఫోన్‌ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme GT 6 పేరుతో వస్తోన్న ఈ డివైజ్ భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని రియల్మీ కంపెనీ అఫీషియల్ గా వెల్లడించింది. ఇప్పటికే చైనాలో లాంచైన Realme GT Neo 6 కి రీబ్రాండ్ వర్షన్ గా Realme GT 6 వస్తోందని సమాచారం.

Realme GT 6 లాంచ్ టైమ్‌లైన్

Realme GT 6 స్మార్ట్‌ఫోన్ ఇండియా, ఇటలీ, ఇండోనేషియా, స్పెయిన్, థాయిలాండ్, మలేషియా, మెక్సికో, ఫిలిప్పైన్స్, బ్రెజిల్, పొలాండ్, టర్కీ, సౌదీ అరేబియా దేశాల్లో లాంచ్ అవ్వనుందని రియల్మీ తెలిపింది.

రిపోర్ట్స్ ప్రకారం, Realme GT 6 డివైజ్ జూన్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే లాంచ్ తేదీ ప్రకటన ఉంటుంది.

జీటీ సిరీస్ తో పాటు, ఇతర అన్ని లైనప్స్ కి ఏఐ టెక్నాలజీని విస్తరిస్తామని ఫోర్బ్స్ తో మాట్లాడుతూ, రియల్మీ సీఈవో స్కై లీ వెల్లడించారు.

కొన్ని రోజుల క్రితం Realme GT 6 యొక్క రిటైల్ బాక్స్ ఇమేజ్ కూడా లీకైంది. దీని ద్వారా ఏఐ స్మార్ట్ లూప్, ఏఐ నైట్ విజన్, ఏఐ స్మార్ట్ రిమూవల్, ఏఐ స్మార్ట్ సెర్చ్ వంటి ఫీచర్లు రివీల్ అయ్యాయి.

Realme GT Neo 6 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Realme GT Neo 6 లో 6.78-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme GT Neo 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3GHz.

ర్యామ్, స్టోరేజీ: Realme GT Neo 6 రెండు ర్యామ్ మోడల్స్ లో చైనాలో లాంచ్ అయ్యింది. 12జిబి + 256జిబి, 16జిబి + 256జిబి/1టిబి ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్‌లో అందించారు.

కెమెరా: Realme GT Neo 6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో సోని ఐఎంఎక్స్615 లెన్స్ వాడారు.

బ్యాటరీ: Realme GT Neo 6 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme GT Neo 6 లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, ఐపీ65 రేటింగ్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి.

Previous articleMotorola G04s: 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్
Next articleVivo: చైనాలో లాంచైన Vivo S19, Vivo S19 Pro
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.