
Vivo V40 సిరీస్ గ్లోబల్ లాంచ్ కి ముందు 91mobiles ఎక్స్‌క్లూజివ్‌గా యూరోపియన్ మోడల్ రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్‌ను టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే సౌజన్యంతో మీ ముందుకు తీసుకొచ్చింది. రెండర్స్ ద్వారా Vivo V40 డిజైన్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. ఓసారి రివీలైన పూర్తి స్పెసిఫికేషన్స్ తో పాటు, డిజైన్ వివరాలను తెలుసుకుందాం పదండి.
Vivo V40 ఫస్ట్ లుక్
టిప్‌స్టర్ సుదాన్శు షేర్ చేసిన రెండర్స్ ప్రకారం, Vivo V40 కొత్త డిజైన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. వీ30 కంటే వీ40 లుక్ భిన్నంగా ఉంది.
Vivo V40 లో ముందువైపు కర్వ్డ్ ఎడ్జ్ డిజైన్, సన్నని బెజెల్స్, సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.
ఫోన్‌కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై ఓవల్ షేప్ లో భారీ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెన్సర్స్, జీస్ బ్రాండింగ్ ఉన్నాయి.
కెమెరా మాడ్యూల్ క్రింద మరొక ఓవల్ షేప్డ్ మాడ్యూల్ ఉంది. ఇందులో స్మార్ట్ ఆరా లైట్, మరొక సెన్సర్ కటౌట్ ఉన్నాయి. మరొక సెన్సర్ ఏంటో ప్రస్తుతానికి తెలియదు.
రెండర్స్ ని గమనిస్తే, Vivo V40 పర్పుల్ మరియు గ్రే/సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో కనిపిస్తోంది.
Vivo V40 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo V40 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
ప్రాసెసర్: Vivo V40 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
ర్యామ్, స్టోరేజీ: Vivo V40 డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో రానుంది. ఇతర మెమొరీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
కెమెరా: Vivo V40 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ, చార్జింగ్: Vivo V40 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
సాఫ్ట్వేర్: Vivo V40 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.
కనెక్టివిటీ: Vivo V40 లో డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.
ఇతర ఫీచర్లు: Vivo V40 డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. గత మోడల్ Vivo V30 ఐపీ54 రేటింగ్ తో వచ్చింది. అంటే వీ40 ఈ విషయంలో అప్‌గ్రేడ్ అయ్యిందని చెప్పవచ్చు.












