
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix తాజాగా గ్లోబల్ మార్కెట్ లో Note 40 Series రేసింగ్ ఎడిషన్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Infinix Note 40, Note 40 5G, Note 40 Pro, Note 40 Pro 5G, Note 40 Pro+ 5G స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి. బీఎండబ్ల్యూ డిజైన్ తో ఈ ఫోన్లు వచ్చాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో సేల్‌కి అందుబాటు ఉన్నాయి. ఓసారి ధర వివరాలు తెలుసుకుందాం.
Infinix Note 40 Series Racing Edition గ్లోబల్‌గా విడుదల
Infinix Note 40 Series Racing Edition లో భాగంగా మొత్తం 5 మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఈ కొత్త మోడల్స్ ను బీఎండబ్ల్యూ గ్రూప్ డిజైన్వర్క్స్ తో కలిసి ఇన్ఫినిక్స్ రూపొందించింది.
డివైజెస్ బ్యాక్ ప్యానెల్ పై సన్నని స్ట్రిప్ లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్ బెటర్ గ్రిప్ అందిస్తాయి.
బ్రాండ్ ప్రకారం, ఈ డిజైన్‌ను అడ్వాన్స్డ్ యూవీ ట్రాన్స్ఫర్ ప్రింటింగ్ ప్రాసెస్‌ను ఉపయోగించి రూపొందించినట్లు తెలుస్తోంది.
లాంచైన 5 స్మార్ట్ఫోన్లు గ్లాసీ ఫినిష్ తో సిల్వర్ కలర్ ఆప్షన్ లో వచ్చాయి. రియర్ కెమెరా మాడ్యూల్ వద్ద ట్రైకలర్ కూడా కనిపిస్తోంది.
Infinix Note 40 Series Racing Edition పలు సాఫ్ట్వేర్ మార్పులతో వచ్చింది. యూజర్లు ఎక్స్‌క్లూజివ్ వాల్‌పేపర్స్, యూఐ ఎలిమెంట్స్ ను ఈ కొత్త రేసింగ్ ఎడిషన్ మోడల్స్ లో పొందవచ్చు.
Infinix Note 40 Series Racing Edition ధర
రేసింగ్ ఎడిషన్ లో పలు డిజైన్ మార్పులు తప్పితే మిగతా అంతా గత మోడల్స్ మాదిరి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. వీటిలో మార్పు లేదు. అయితే ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఆ వివరాలు చూద్దాం.
Infinix Note 40 Racing Edition ధరను 209 డాలర్లు (సుమారు రూ.17,453) గా నిర్ణయించారు.
Infinix Note 40 5G Racing Edition ధర 259 డాలర్లు (సుమారు రూ.21,629) గా ఉంది.
Infinix Note 40 Pro Racing Edition ధర 279 డాలర్లు (సుమారు రూ.23,299) గా ఉంది.
Infinix Note 40 Pro 5G రేసింగ్ ఎడిషన్ ధర 309 డాలర్లు (సుమారు రూ.25,804) గా ఉంది.
Infinix Note 40 Pro+ 5G రేసింగ్ ఎడిషన్ ధర 329 డాలర్లు (సుమారు రూ.27,474) గా ఉంది.
Infinix Note 40 Series Racing Edition స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి.











