Realme: భారత్‌లో లాంచైన Narzo 70x 5G 8జిబి ర్యామ్ వేరియంట్

Highlights

  • Realme Narzo 70x 5G 8జిబి మోడల్ లాంచ్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి కెమెరా
  • అమెజాన్ ద్వారా డివైజ్ సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం Realme Narzo 70x 5G డివైజ్ ను లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ యొక్క 8జిబి వేరియంట్‌ను భారత్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి 8జిబి వేరియంట్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme Narzo 70x 5G ధర, లభ్యత

Realme Narzo 70x 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.14,999 గా నిర్ణయించారు. 4జిబి + 128జిబి మోడల్ ధర రూ.11,499 గా ఉంది. 6జిబి + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,499 గా ఉంది. ఈ ఫోన్‌ని అమెజాన్ మరియు రియల్మీ ఈస్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ.2,000 ఇన్‌స్టంట్ కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ జూన్ 14 దాకా చెల్లుబాటు అవుతుంది. అంతేకాదు, రియల్మీ స్టోర్ ద్వారా ఫోన్ కొనేవారు, రియల్మీ బడ్స్ వైర్లెస్ 2 నియో ను రూ.899 కి లేదా రియల్మీ టెక్‌లైఫ్ డ్స్ టీ100 ను రూ.1,299 కి కొనుగోలు చేయవచ్చు.

Realme Narzo 70x 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme Narzo 70x 5G లో 6.72-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ (2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 950 నిట్స్ హెచ్‌బీఎమ్ బ్రైట్నెస్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme Narzo 70x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.

మెమొరీ: Realme Narzo 70x 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 6జిబి డైనమిక్ ర్యామ్ ఆప్షన్ ఉంది.

సాఫ్ట్‌వేర్: Realme Narzo 70x 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Realme Narzo 70x 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మోనో కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.

బ్యాటరీ: Realme Narzo 70x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme Narzo 70x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, క్యూజెడ్ఎస్ఎస్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme Narzo 70x 5G లో ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, వీసీ కూలింగ్ సిస్టమ్, అంటెన్నా అర్రే మ్యాట్రిక్స్ 2.0, టీయూవీ ఎస్‌యూడీ 48-మంథ్ ఫ్యూయెన్సీ సర్టిఫికేషన్, డైనమిక్ బటన్, మినీ క్యాప్సూల్ 2.0 ఉన్నాయి.

Previous articleRealme GT 6 చిప్సెట్, బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ఖరారు
Next articleVivo Y28s 5G: గీక్‌బెంచ్ ద్వారా లీకైన వై28ఎస్ స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.