OnePlus Ace 3 Pro: లీకైన ఏస్ 3 ప్రో బ్యాటరీ, చార్జింగ్ స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో OnePlus Ace 3 Pro లాంచ్
  • జులైలో చైనాలో లాంచ్ అయ్యే అవకాశం
  • తాజాగా లీకైన డివైజ్ బ్యాటరీ స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో ఏస్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Ace 3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ చైనాలో జులై నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. తాజాగా వన్‌ప్లస్ ఏస్ 3 ప్రో యొక్క బ్యాటరీ మరియు చార్జింగ్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ లీకైన వివరాలు తెలుసుకుందాం.

OnePlus Ace 3 Pro బ్యాటరీ, చార్జింగ్ కెపాసిటీ (లీక్)

చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OnePlus Ace 3 Pro యొక్క బ్యాటరీ మరియు చార్జింగ్ కెపాసిటీ వివరాలను లీక్ చేశారు. లీక్ ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ అల్ట్రా-హై-డెన్సిటీ బ్యాటరీతో వస్తున్నట్లు సమాచారం.

OnePlus Ace 3 Pro డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో కూడా వస్తున్నట్లు లీక్‌స్టర్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్

OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం చైనాలో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఓసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

డిస్ప్లే: OnePlus Ace 3 లో 6.7-ఇంచ్ 1.5కే స్క్రీన్, ఓఎల్ఈడీ ప్రోఎక్స్‌డీఆర్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus Ace 3 లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు.

ఓఎస్: OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: OnePlus Ace 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OnePlus Ace 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: OnePlus Ace 3 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, అలర్ట్ స్లైడర్ ఉన్నాయి.

Previous articleRealme GT 6: లీకైన రియల్మీ జీటీ 6 ధర, స్పెసిఫికేషన్స్
Next articleInfinix Note 40 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.