
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y58 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐపీ64 రేటింగ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Vivo Y58 5G ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్
Vivo Y58 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎంతో తెలుసుకుందాం.
భారతీయ మార్కెట్ లో Vivo Y58 5G డివైజ్ ధరను రూ.19,499 గా నిర్ణయించారు. ప్రస్తుతం వివో ఈస్టోర్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంది.
Vivo Y58 5G స్మార్ట్‌ఫోన్ సుందర్‌బన్స్ గ్రీన్ మరియు హిమాలయన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Vivo Y58 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo Y58 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1024 నిట్స్ హెచ్‌బీఎమ్ బ్రైట్నెస్, 1400:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo Y58 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇందులో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 613 జీపీయూ వినియోగించారు.
మెమొరీ: Vivo Y58 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని అందించారు.
సాఫ్ట్‌వేర్: Vivo Y58 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.
కెమెరా: Vivo Y58 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఏఐ పొట్రెయిట్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్, స్మార్ట్ డైనమిక్ లైట్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి పొట్రెయిట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Vivo Y58 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సెక్యూరిటీ: Vivo Y58 5G డివైజ్ ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. దీంతో నీరు మరియు దుమ్ము నుంచి ఈ ఫోన్ కి రక్షణ లభిస్తుంది.
కనెక్టివిటీ: Vivo Y58 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, క్యూజీఎస్ఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











