
ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్ లో Lava Blaze X అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో అధిక ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Lava Blaze X ధర, లభ్యత
Lava Blaze X స్మార్ట్‌ఫోన్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Lava Blaze X 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,999 గా ఉంది. 6జిబి+128జిబి మోడల్ ధర రూ.15,999 గా ఉంది. 8జిబి+128జిబి వేరియంట్ ధరను రూ.16,999 గా నిర్ణయించారు.
లాంచ్ ఆఫర్ లో భాగంగా డివైజ్ కొనుగోలుపై రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ ఆఫర్ తో బేస్ మోడల్ రూ.13,999, మిడ్ మోడల్ రూ.14,999, టాప్ మోడల్ రూ.15,999 కి లభిస్తుంది.
Lava Blaze X డివైజ్ టైటానియమ్ గ్రే మరియు స్టెరిలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. జులై 20వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ మరియు ఇతర ప్లాట్ఫామ్స్ ద్వారా Lava Blaze X సేల్ ప్రారంభం కానుంది.
Lava Blaze X స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Lava Blaze X లో 6.67-ఇంచ్ హెచ్డీ+ 3డీ కర్వ్డ్ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Lava Blaze X లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. ఈ చిప్ ఉత్తమమైన గేమింగ్ అనుభూతిని అందిస్తుంది.
ర్యామ్, స్టోరేజీ: Lava Blaze X 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో యూజర్లకి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
కెమెరా: Lava Blaze X లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: Lava Blaze X లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Lava Blaze X స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్ తో పాటు, 2 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
కనెక్టివిటీ: Lava Blaze X లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.











