POCO M6 Plus: రివీలైన పోకో ఎమ్6+ ఇండియా ధర, పూర్తి స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో POCO M6 Plus లాంచ్
  • తాజాగా రివీలైన ధర, స్పెసిఫికేషన్స్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.13,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO త్వరలో ఎమ్6 సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. POCO M6 Plus పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా 91mobiles కి ఈ ఫోన్‌కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం లభించింది. ఒక టిప్‌స్టర్ POCO M6 Plus యొక్క భారత మార్కెట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ షేర్ చేశారు. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

POCO M6 Plus భారత మార్కెట్ ధర వివరాలు

ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు ప్రకారం, POCO M6 Plus యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.13,999 గా ఉంటుంది. 8జిబి ర్యామ్ + 128జిబి మోడల్ ధర రూ.14,999 ఉంటుంది. ఈ ఫోన్ పై రూ.1,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభించనుంది.

POCO M6 Plus డిజైన్, కలర్స్ (రెండర్స్)

POCO M6 Plus యొక్క డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్ రెండర్స్ ద్వారా రివీల్ అయ్యాయి. ఎమ్6 ప్లస్ ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్ రింగ్, పంచ్ హోల్ డిస్ప్లే, ఫ్లాట్ ఎడ్జెస్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌కి కుడివైపున వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్ ఉంటాయి. పర్పుల్, బ్లాక్ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

POCO M6 Plus 5G స్పెసిఫికేషన్స్

POCO M6 Plus 5G లో 6.79-ఇంచ్ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఉంటాయి. ఇంకా ఈ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.

Previous articleitel A80: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన ఐటెల్ ఏ80
Next articleOnePlus 12R: సన్సెట్ డ్యూన్ కలర్‌‌లో లాంచైన వన్‌ప్లస్ 12ఆర్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.