
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఇటీవలె Moto G85 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది. కర్వ్డ్ డిస్ప్లే, పీఓఎల్ఈడీ ప్యానెల్, 12జిబి వరకు ర్యామ్, ఓఐఎస్ మెయిన్ కెమెరా Moto G85 5G లో ఉన్నాయి. నేటి నుంచి ఈ ఫోన్ యొక్క సేల్ ప్రారంభమైంది. ఓసారి ధర, సేల్ ఆఫర్ వివరాలు తెలుసుకుందాం పదండి.
Moto G85 5G సేల్
Moto G85 5G స్మార్ట్‌ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధరను రూ.17,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.19,999 గా ఉంది. ఈ ఫోన్ ఆలివ్ గ్రీన్, కొబాల్ట్ బ్లూ మరియు అర్బన్ గ్రే కలర్స్ లో లభిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ మొదలైంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
Moto G85 5G ఆఫర్లు
Moto G85 5G కొనే కస్టమర్లకు రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. మీకు గనుక యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్ ఈఎంఐ కొనుగోలుకి కూడా వర్తిస్తుంది.
మీ పాత ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకుంటే రూ.1,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Moto G85 5G స్మార్ట్‌ఫోన్‌ని 9 నెలల కాల పరిమితితో, నెలకు రూ.1,889 కనీస మొత్తం చెల్లించి సొంతం చేసుకోవచ్చు.
మీరు గనుక జియో సిమ్ వాడుతున్నట్లయితే, Moto G85 5G పై మీకు రూ.10,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఈ జియో ఆఫర్ లో భాగంగా రూ.2,000 క్యాష్‌బ్యాక్ మరియు రూ.8,000 విలువగల పార్ట్నర్స్ కూపన్స్ లభిస్తాయి.
Moto G85 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Moto G85 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 3డీ కర్వ్డ్ స్క్రీన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
ప్రాసెసర్: Moto G85 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్.
ర్యామ్, స్టోరేజీ: Moto G85 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ర్యామ్ బూస్ట్ టెక్నాలజీతో 24జిబి వరకు ర్యామ్‌ను పెంచుకునే వీలుంది.
కెమెరా: Moto G85 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ, చార్జింగ్: Moto G85 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Moto G85 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. 4 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
కనెక్టివిటీ: Moto G85 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.1, 5GHz వై-ఫై, 13 5జీ బ్యాండ్స్ ఉన్నాయి.











