
ప్రముఖ స్వదేశీ టెక్ బ్రాండ్ boAt తాజాగా భారతీయ మార్కెట్ లో boAt Smart Ring Active ని లాంచ్ చేసింది. దేశంలో అందుబాటులో ఉన్న తక్కువ ధర కలిగిన స్మార్ట్ రింగ్‌గా బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ నిలిచింది. ఈ స్మార్ట్ రింగ్ 5 రోజుల బ్యాటరీ లైఫ్, ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్స్, 5ఏటీఎమ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంది. ఒకసారి, boAt Smart Ring Active యొక్క ధర మరియు పూర్తి ఫీచర్లు తెలుసుకుందాం.
boAt Smart Ring Active ధర మరియు లభ్యత
భారత్‌లో boAt Smart Ring Active ధరను రూ.2,999 గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు కంపెనీ యొక్క వెబ్సైట్ ద్వారా జులై 20వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు.
రేడియంట్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో boAt Smart Ring Active లభిస్తుంది. 7, 8, 9, 10 మరియు 11 సైజుల్లో boAt Smart Ring Active ను కొనుగోలు చేయవచ్చు.
boAt Smart Ring Active ఫీచర్లు
boAt Smart Ring Active స్టెయిన్లెస్ స్టీల్ డిజైన్ తో వచ్చింది. ఇది చాలా తేలికగా ఉండటం వల్లన, ధరించడం సులభం.
ఈ స్మార్ట్ రింగ్ 20 కి పైగా స్పోర్ట్స్ మరియు యాక్టివిటీస్ ను ట్రాక్ చేయగలదు. ఈ డివైజ్ లో వివిధ హెల్త్ మరియు ఫిట్నెస్ మానిటరింగ్ ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. వీటిలో హార్ట్ రేట్, ఎస్పీఓ2, స్ట్రెస్, స్లీప్ లెవెల్ వంటివి ఉన్నాయి.
boAt Smart Ring Active డివైజ్ మాగ్నెటిక్ చార్జింగ్ కేస్ తో వస్తోంది. ఇదే స్టోరేజీ బాక్స్ లాగా ఉపయోగపడుతుంది.
5ఏటీఎమ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్‌ను boAt Smart Ring Active లో అందించారు. 50 మీటర్ల లోతులో కూడా ఈ స్మార్ట్ రింగ్ ఒత్తిడిని తట్టుకుని సేఫ్ గా ఉండగలదు.
5ఏటీఎమ్ రేటింగ్ వల్లన, యూజర్లు ఈ రింగ్ ధరించి ఈత కొట్టడం, స్నానం చేయడం వంటి పనులను చేయవచ్చు.
boAt Smart Ring Active లో బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ ఉంది. షేక్ జెశ్చర్స్ ద్వారా యూజర్లు ఫోటోలు తీసుకోవచ్చు. ఏఆర్ వ్యూ ద్వారా రియల్ టైమ్ హెల్త్ డేటాను పొందవచ్చు.
boAt Smart Ring Active ఫుల్ చార్జ్ పై 5 రోజుల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది.











