Smallest 5G Smartphone: 100MP కెమెరాతో లాంచైన ప్రపంచపు అతిచిన్న 5జీ స్మార్ట్‌ఫోన్

Highlights

  • ప్రపంచపు అతిచిన్న 5జీ ఫోన్ లాంచ్
  • ఈ ఫోన్ పేరు Unihertz Jelly Max
  • Unihertz Jelly Max ధర

ప్రపంచపు అతిచిన్నదైన 5జీ స్మార్ట్‌ఫోన్ Unihertz Jelly Max గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్, పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. Unihertz Jelly Max డివైజ్ 128.7 మి.మీ పొడవు, 62.7 మి.మీ వెడల్పు, 16.3 మి.మీ మందం ఉంటుంది. ఈ డైమెన్షన్స్ iPhone 13 mini కంటే కూడా తక్కువగా ఉన్నాయి. సైజ్ అయితే తక్కువే కానీ, బరువు మాత్రం చాలా ఎక్కువగా ఉంది.

Unihertz Jelly Max స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Unihertz Jelly Max లో 5.05-ఇంచ్ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 720*1520 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Unihertz Jelly Max లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు. 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఈ చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్.

కెమెరా: Unihertz Jelly Max లో 100ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి టెలీఫోటో 3.4x జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Unihertz Jelly Max లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 20 నిమిషాల్లో ఈ ఫోన్ 90 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

ఇతర ఫీచర్లు: Unihertz Jelly Max లో డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్, ఓటీజీ, ఎఫ్ఎమ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి. మెమొరీ కార్డ్ స్లాట్ కూడా ఈ ఫోన్ లో అందించారు.

Previous articleboAt Smart Ring Active: రూ.2,999 ధరతో భారత్‌లో లాంచైన బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్
Next articleXiaomi: చైనాలో లాంచైన MIX Fold 4, MIX Flip
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.