iPhone SE 4: లీకైన ఐఫోన్ ఎస్ఈ 4 స్పెసిఫికేషన్స్, ధర, లాంచ్ టైమ్‌లైన్

Highlights

  • త్వరలో iPhone SE 4 లాంచ్
  • 48ఎంపి మెయిన్ కెమెరా
  • 6.06-ఇంచ్ 60Hz డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iPhone త్వరలో SE సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iPhone SE 4 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ధర మరియు లాంచ్ టైమ్‌లైన్ రివీల్ అయ్యింది. ఓసారి ఐఫోన్ ఎస్ఈ4 గురించి టిప్‌స్టర్ ద్వారా లీకైన సమాచారం ఏంటో తెలుసుకుందాం.

iPhone SE 4 స్పెసిఫికేషన్స్ (లీక్)

iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ యొక్క వివరాలను టిప్‌స్టర్ Ice Universe షేర్ చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

టిప్‌స్టర్ ప్రకారం, iPhone SE 4 డివైజ్ 48ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ లీక్ ద్వారా iPhone SE 4 డిజైన్ ఐఫోన్ 16 మాదిరి ఉంటుందని తెలిసింది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ కి సంబంధించిన వివరాలు 91mobiles కి ఒక రిపోర్ట్ ద్వారా అందాయి. CAD ఆధారిత రెండర్ ద్వారా బ్యాక్ ప్యానెల్ పై సింగిల్ కెమెరా ఉన్నట్లు తెలుస్తోంది.

టిప్‌స్టర్ ప్రకారం, iPhone SE 4 సింగిల్ కెమెరాతో వస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ ఫోన్ లో 6.06-ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. గత ఎస్ఈ మోడల్ 4.7-ఇంచ్ ప్యానెల్ కలిగి ఉంది. దీన్ని బట్టి, ఇది మేజర్ అప్‌గ్రేడ్ అని తెలుస్తోంది. అయితే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మాత్రం అలాగే కొనసాగనుంది.

iPhone SE 4 లో ఏ18 చిప్సెట్ ఉంటుంది. ఈ ఫోన్ 6జిబి ర్యామ్, 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

iPhone SE 4 డివైజ్ లో అల్యూమినియమ్ ఫ్రేమ ఉండవచ్చని టిప్‌స్టర్ చెబుతున్నారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్ లైనప్ డిజైన్ లాగే iPhone SE 4 ఉంటుందని సమాచారం.

iPhone SE 4 లో ఫేస్ ఐడీ తో పాటు, లైట్నింగ్ కనెక్టర్ కి బదులు యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది.

iPhone SE 4 ధర మరియు లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ ధర 499 డాలర్లు (సుమారు రూ.41,800) నుంచి 549 డాలర్లు (సుమారు రూ.46,000) మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. లాంచ్ టైమ్‌లైన్ విషయానికి వస్తే, iPhone SE 4 డివైజ్ 2025 మార్చి నుంచి మే మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.