iQOO 13: రివీలైన ఐకూ 13 డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో iQOO 13 లాంచ్
  • 2కే బీఓఈ ఓఎల్ఈడీ స్క్రీన్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్‌ను లాంచ్ చేయనుంది. iQOO 13 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి విడుదల కానుంది. అయితే ఈ ఫోన్ లాంచ్‌కి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రాలేదు. ఈలోపు ఫోన్ యొక్క డిజైన్ మరియు ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి లీకైన వివరాలు తెలుసుకుందాం.

iQOO 13 స్పెసిఫికేషన్స్ (లీక్)

iQOO 13 స్మార్ట్‌ఫోన్ యొక్క వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ వీబో పై షేర్ చేశారు.

లీక్ ప్రకారం, iQOO 13 డివైజ్ బీఓఈ ఫ్లాట్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్ ఉన్నాయి.

iQOO 13 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఇంకా ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కెపాసిటీతో రానున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది.

iQOO 13 స్మార్ట్‌ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ చెబుతున్నారు.

iQOO 12 స్పెసిఫికేషన్స్

iQOO 12 5G లో 6.78-ఇంచ్ 1.5కే బీఓఈ ఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. iQOO 12 5G లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది.

iQOO 12 5G డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీతో వచ్చింది. iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. iQOO 12 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

iQOO 12 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. iQOO 12 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

Previous articleUnion Budget 2024: తగ్గనున్న మొబైల్ ఫోన్లు, చార్జర్ల ధరలు
Next articleRealme 12 Pro 5G ధర రూ.4,500 తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.