
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా భారతీయ మార్కెట్ లో ఒక నార్జో సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Realme Narzo N61 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ ఆర్మర్ షెల్ తో ఎక్విప్ అయి వచ్చింది. అంటే దృఢమైన బాడీని ఈ ఫోన్ కి అందించారని తెలుస్తోంది. ఈ ఫోన్ లో 6జిబి వర్చువల్ ర్యామ్, 6జిబి ఫిజికల్ ర్యామ్ అందించారు. ఈ ఫోన్ ప్రారంభ ధరను రూ.7,499 గా పెట్టారు. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Realme Narzo N61 ధర
Realme Narzo N61 యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.7,499 గా పెట్టారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.8,499 గా ఉంది. రెండు మోడల్స్ పై రూ.500 డిస్కౌంట్ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో ఈ ఫోన్లు వరుసగా రూ.6,999 మరియు రూ.7,999 ధరలకి లభించనున్నాయి.
Realme Narzo N61 స్మార్ట్‌ఫోన్ వొయేజ్ బ్లూ మరియు మార్బుల్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది. ఆగస్టు 6వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ కి వస్తోంది.
Realme Narzo N61 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Realme Narzo N61 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Realme Narzo N61 లో యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.8 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
మెమొరీ: Realme Narzo N61 డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 6జిబి డైనమిక్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
కెమెరా: Realme Narzo N61 లో 32ఎంపి సూపర్ క్లియర్ మెయిన్ కెమెరా అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: Realme Narzo N61 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఈ ఫోన్ లో ఉంది.
ఇతర ఫీచర్లు: Realme Narzo N61 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ54 ప్రొటెక్షన్, ఏఐ బూస్ట్ టెక్నాలజీ ఉన్నాయి.











