JioBharat J1 4G: భారత్‌లో లాంచైన జియో భారత్ జె1 4జీ కీప్యాడ్ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • భారత్‌లో JioBharat J1 4G లాంచ్
  • యూపీఐ సపోర్ట్ తో వచ్చిన ఫోన్
  • 455+ లైవ్ టీవీ స్ట్రీమింగ్ చానల్స్

ప్రముఖ టెలీకామ్ కంపెనీ Jio తాజాగా భారతీయ మార్కెట్ లో బడ్జెట్-ఫ్రెండ్లీ 4జీ కీప్యాడ్ ఫోన్‌ని లాంచ్ చేసింది. JioBharat J1 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ కీప్యాడ్ ఫోన్ యూపీఐ పేమెంట్స్, లైవ్ టీవీ మరియు మ్యూజిక్ స్ట్రీమింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై ఒక కెమెరాను అందించారు. సరే, ఓసారి ఈ డివైజ్ ధర మరియు పూర్తి ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

JioBharat J1 4G ధర, లభ్యత

JioBharat J1 4G కీప్యాడ్ ఫోన్ ధరను భారత్ లో రూ.1,799 గా నిర్ణయించారు. ప్రస్తుతం అమెజాన్ మరియు జియో ఆఫ్‌లైన్ స్టోర్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది.

JioBharat J1 4G ఫీచర్లు

JioBharat J1 4G కీప్యాడ్ ఫోన్‌లో 2.8-ఇంచ్ స్క్రీన్, కీప్యాడ్ బటన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 4-నేవిగేషన్ బటన్స్, ఒక సెలెక్ట్ బటన్ మరియు కాల్ యాక్సెప్ట్, రిజెక్ట్ డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి.

JioBharat J1 4G ఫోన్ Threadx RTOS ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ జియోపే యాప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ కి సపోర్ట్ చేస్తుంది. యూపీఐ ద్వారా డబ్బుని పంపడం, పొందడం చేయవచ్చు. దీనికి ఎటువంటి అదనపు చార్జీలు పడవు. అంతేకాదు, ఈ ఫోన్ లో ఇచ్చిన సింగిల్ రియర్ కెమెరా ద్వారా దుకాణదారు వద్ద క్యూఆర్ కోడ్స్‌ని స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.

JioBharat J1 4G డివైజ్ జియోటీవీ, జియోసినిమా మరియు జియోసావన్ యాప్స్ ద్వారా లైవ్ టీవీ, మూవీస్, మ్యూజిక్ కి సపోర్ట్ చేస్తుంది. 455+ పైగా లైవ్ టీవీ చానల్స్ కి సపోర్ట్ కలదు. జియోఫోటోస్ క్లౌడ్ స్టోరేజీకి యూజర్ తన ఫోటోలు, వీడియోలను షేర్ చేసుకోవడంతో పాటు, యాక్సెస్ కూడా చేయవచ్చు. ఇంకా ఈ ఫోన్ లో టాప్-మౌంటెడ్ ఎల్ఈడీ ఫ్లాష్ ను టార్చ్ లాగా వాడుకోవచ్చు.

JioBharat J1 4G కీప్యాడ్ ఫోన్ లో 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇకపోతే ఈ ఫోన్ జియో 4జీ నెట్వర్క్ తో లాక్ చేయబడి ఉంటుంది. జియో భారత్ నెలవారీ రీచార్జ్ ప్లాన్ రూ.123 ద్వారా యూజర్లు అపరిమిత కాల్స్, 14జిబి పూర్తి డేటా, జియో యాప్స్‌కి యాక్సెస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. యూపీఐ, టీవీ స్ట్రీమింగ్ మరియు ఇతర ఫీచర్లు వేరే సిమ్ కార్డ్ ద్వారా పనిచేయవు. JioBharat J1 4G ఫోన్ పై జియో సంస్థ 1 ఏడాది వ్యారంటీ ఇస్తోంది.