Honor Magic 6 Pro: 180MP కెమెరా, 512GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన హానర్ కొత్త ఫోన్

Highlights

  • భారత్‌లో Honor Magic 6 Pro లాంచ్
  • 5600 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జిబి ర్యామ్
  • Honor Magic 6 Pro ధర రూ.89,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor నేడు భారతీయ మార్కెట్ లో తన ఫ్లాగ్షిప్ డివైజ్ Honor Magic 6 Pro ని లాంచ్ చేసింది. 180ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా, 50ఎంపి సెల్పీ కెమెరా, 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, 5600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం.

Honor Magic 6 Pro ధర, సేల్ వివరాలు

Honor Magic 6 Pro డివైజ్ సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ ధర ఎంతో తెలుసుకుందాం.

Honor Magic 6 Pro యొక్క 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.89,999 గా పెట్టారు.

Honor Magic 6 Pro డివైజ్ బ్లాక్ మరియు ఎపిక్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది.

లాంచ్ ఆఫర్లతో పాటు, బ్యాంక్ ఆఫర్లు మరియు నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆప్షన్స్ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

Honor Magic 6 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Honor Magic 6 Pro లో 6.80-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 453 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 10.7 మిలియన్ కలర్స్, డాల్బీ విజన్, హెచ్డీఆర్ వివిడ్ టెక్నాలజీ ఉన్నాయి.

ప్రాసెసర్: Honor Magic 6 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.3 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Honor Magic 6 Pro డివైజ్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Honor Magic 6 Pro లో 50ఎంపి ప్రైమరీ యాంగిల్ కెమెరా, 180ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో ఓఐఎస్ లెన్స్, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Honor Magic 6 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 66 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Honor Magic 6 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Honor Magic 6 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Honor Magic 6 Pro లో ఐపీ68 ప్రొటెక్షన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఏఐ ఫీచర్లు ఉన్నాయి.