
ఇటీవలె భారతీయ మార్కెట్ లో Motorola Edge 50 మరియు Nothing Phone (2a) Plus ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు కూడా యూజర్లకు నచ్చే ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చాయి. ఇక ఈ డివైజెస్ 8జిబి ర్యామ్ వేరియంట్ యొక్క ధర రూ.27,999 గా ఉంది. అలాగే ఈ రెండు ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మరి రెండింట్లో ఏది ఉత్తమమైన పవర్ బ్యాకప్ ఇస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. మేం, ఈ రెండు ఫోన్లను పీసీమార్క్ బ్యాటరీ బెంచ్‌మార్క్ వినియోగించి పరీక్షలు జరిపాం. అలాగే గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ టెస్ట్‌లు కూడా చేసి బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో పరిశీలించాం. ఆ వివరాలు మీకోసం అందిస్తున్నాం.
పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్
పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ రెండు ఫోన్ల బ్యాటరీ లైఫ్ కూడా 20 శాతానికి పడిపోయే దాకా చేయడం జరిగింది. మోటో ఎడ్జ్ 50 మరియు నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఫోన్లను 100 శాతం బ్యాటరీతో, 50 శాతం వాల్యూమ్ మరియు బ్రైట్నెస్ లెవెల్స్ తో టెస్ట్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ లో Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్ 10 గంటల 50 నిమిషాల స్కోర్ చేయగా, Nothing Phone 2a Plus 14 గంటల 34 నిమిషాల స్కోర్ చేసింది.
విజేత: Nothing Phone (2a) Plus
వీడియో స్ట్రీమింగ్
వీడియో స్ట్రీమింగ్ టెస్ట్ లో మోటోరోలా ఎడ్జ్ 50 యొక్క బ్యాటరీ 30 నిమిషాల తర్వాత 5 శాతం ఖర్చయ్యింది. టెస్టింగ్ సమయంలో మ్యాగ్జిమమ్ సపోర్టెడ్ రెజుల్యూషన్, 50 శాతం బ్రైట్నెస్, 50 శాతం వాల్యూమ్ లెవెల్స్ ఉన్నాయి. ఇవే సెట్టింగ్స్ తో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో వీడియో స్ట్రీమింగ్ టెస్ట్ చేయగా, 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. దీన్ని 200mAh అని చెప్పవచ్చు. మరోవైపు మోటో ఎడ్జ్ 50 లో ఇది 250mAh గా ఉంది.
విజేత: Nothing Phone (2a) Plus
గేమింగ్
గేమింగ్ టెస్ట్ లో కూడా Nothing Phone (2a) Plus, Moto Edge 50 కంటే ఉత్తమమైన బ్యాటరీ పనితీరును కనబర్చింది. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ మరియు రియల్ రేసింగ్ 3 గేమ్స్‌ను ప్రతీ ఒక్క దాన్ని 30 నిమిషాల చొప్పున ఆడితే నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో 19 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. మరోవైపు మోటోరోలా ఎడ్జ్ 50 లో 26 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది.
విజేత: Nothing Phone (2a) Plus
చార్జింగ్ స్పీడ్స్
చార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే, Motorola Edge 50 తన 68W ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యంతో మెరుగ్గా కనిపిస్తోంది. కంపెనీ బాక్స్ లో అందించిన చార్జర్ తో రెగ్యులర్ మోడ్‌లో చార్జ్ చేసినప్పుడు, 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 40 నిమిషాల సమయం పట్టింది. అదే, చార్జ్ బూస్ట్ మోడ్‌లో 30 నిమిషాల సమయం పట్టింది.
మరోవైపు, Nothing Phone (2a) Plus 50 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. కానీ, బాక్స్ లో చార్జర్ తో రావడంలేదు. కంపాటిబుల్ థర్డ్-పార్టీ పీడీ చార్జర్ తో జరిపిన టెస్ట్ లో ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 51 నిమిషాల సమయం పట్టింది.
విజేత: Motorola Edge 50
ఏది బెస్ట్?
Nothing Phone (2a) Plus మెరుగైన బ్యాటరీ పనితీరుతో Motorola Edge 50 తో పోల్చితే.. బెంచ్‌మార్క్ టెస్ట్‌లు, గేమింగ్ మరియు స్ట్రీమింగ్ విషయాల్లో మేటిగా నిలిచింది. అయితే, Motorola Edge 50 ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్, బాక్స్ లో చార్జర్.. వంటి విషయాల్లో ముందు వరుసలో ఉంది. మీ అవసరానికి అనుగుణంగా రెండు ఫోన్లలో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది.




![Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/10/Best-camera-phones-under-25k-oct-218x150.jpg?tr=q-70)
![Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/10/Best-performing-phones-under-20k-sep-2024-218x150.jpg?tr=q-70)
![Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/09/Fastest-charging-phones-under-25k-218x150.jpg?tr=q-70)








