
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారత్ లో వీ40 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo V40e పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందని స్పష్టమవుతోంది. మరోవైపు, బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్‌బెంచ్ పై కూడా Vivo V40e లిస్ట్ అయ్యింది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Vivo V40e బీఐఎస్ లిస్టింగ్
వివో నుంచి త్వరలో రాబోవు ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్సైట్ BIS పై V2403 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
ఐఎంఈఐ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సైట్స్ పై ఇదే మోడల్ నంబర్ తో Vivo V40e లిస్ట్ అయ్యింది.
V2422 అనే మరో మోడల్ నంబర్ కూడా బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. ఐఎంఈఐ డేటాబేస్ ప్రకారం, ఇది Vivo Y200 Plus 5G అని తెలుస్తోంది.
ఇక, బీఐఎస్ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పా, మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు.

Vivo V40e గీక్‌బెంచ్ లిస్టింగ్
Vivo V40e స్మార్ట్‌ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్‌బెంచ్ పై V2403 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
Vivo V40e స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1028 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2938 పాయింట్లు స్కోర్ చేసింది.
Vivo V40e లో ఆక్టా-కోర్ చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్. ఈ చిప్‌కు మాలి జీ615 ఎంసీ2 జీపీయూ గ్రాఫిక్స్ ను జత చేశారు.
గీక్‌బెంచ్ వివరాల ప్రకారం, Vivo V40e లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది.
ఇంకా ఈ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

Vivo V40 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo V40 5G లో 6.78-ఇంచ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్ (2800*1260 పిక్సెల్స్), అమోలెడ్ కర్వ్డ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo V40 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.63 గిగాహెర్ట్జ్.
మెమొరీ: Vivo V40 5G 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: Vivo V40 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ జీస్ లెన్స్, ఆరాలైట్ ఫీచర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: Vivo V40 5G తో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Vivo V40 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











