భారతీయ మార్కెట్ లో Vivo V40 రూ.39,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ జీస్-ట్యూన్డ్ కెమెరాలు, అప్‌గ్రేడెడ్ బ్యాటరీ కెపాసిటీతో తన ముందుతరం ఫోన్ Vivo V30 కంటే ఎక్కువ ఫీచర్లతో వచ్చింది. దీని ధర శ్రేణిని బట్టి, OnePlus 12R కి ఈ ఫోన్‌ని పోటీగా భావించవచ్చు. మరి ఈ రెండు ఫోన్లలో ఏ ఫోన్ మెరుగైన పెర్ఫామెన్స్ ఔట్‌పుట్ అందిస్తుందో మేం టెస్ట్ చేశాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.
నోట్: మేం ఈ టెస్టు కోసం Vivo V40 యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్‌ను తీసుకున్నాం. కాబట్టి టాప్ వేరియంట్ తో పోల్చితే స్కోర్లు తక్కువగా ఉంటాయి.
గీక్‌బెంచ్
గీక్‌బెంచ్ టెస్టు వల్లన స్మార్ట్‌ఫోన్ చిప్సెట్ యొక్క సీపీయూ పెర్ఫామెన్స్‌ను అంచనా వేయవచ్చు. Vivo V40 స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1164 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3216 పాయింట్లు నమోదు చేసింది. మరోవైపు, OnePlus 12R సింగిల్-కోర్ టెస్ట్ లో 1066 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 4311 పాయింట్లు నమోదు చేసింది. సింగిల్-కోర్ పెర్ఫామెన్స్ ప్రధానంగా వర్డ్ ప్రాసెసింగ్, వెబ్ బ్రౌజింగ్, యాప్ లోడింగ్ స్పీడ్స్ పై ప్రభావం చూపుతుంది.
మల్టీ-కోర్ పెర్ఫామెన్స్ ప్రధానంగా గేమింగ్, ఫోటో మరియు వీడియో ఎడిటింగ్, మల్టీటాస్కింగ్ తదితర వాటిపై ప్రభావం చూపుతుంది. బెంచ్‌మార్క్ స్కోర్లను బట్టి, వివో వీ40 సింగిల్-కోర్ బేస్డ్ టాస్క్‌లను వన్‌ప్లస్ 12ఆర్ కంటే బెటర్ గా చేస్తోంది. మరోవైపు, OnePlus 12R మల్టీ-కోర్ట్ బేస్డ్ టాస్కుల విషయంలో మెరుగ్గా పెర్ఫామ్ చేస్తోంది.
విజేత: OnePlus 12R
అంటుటు
అంటుటు బెంచ్‌మార్క్ అనేది కాంప్రెహెన్సివ్ టెస్టింగ్ స్టాండర్డ్. ఇది గీక్‌బెంచ్ టెస్ట్ కంటే లోతైనది. స్మార్ట్‌ఫోన్ యొక్క సీపీయూ పెర్ఫామెన్స్, జీపీయూ పెర్ఫామెన్స్, మెమొరీ పెర్ఫామెన్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ వంటి విషయాలను అంటుటు బెంచ్‌మార్క్ ఎవాల్యూయేట్ చేస్తుంది. Vivo V40 యొక్క అంటుటు స్కోర్ 8,10,653 గా ఉంది. మరోవైపు, OnePlus 12R అంటుటు స్కోర్ 12,40,474 గా ఉంది.
విజేత: OnePlus 12R
థ్రాట్లింగ్ టెస్ట్
ఒత్తిడి పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్ యొక్క చిప్సెట్ పనితీరును పరీక్షించడమే ఈ థ్రాట్లింగ్ టెస్ట్. ఈ టెస్ట్ కోసం మేం, బర్నవుట్ బెంచ్‌మార్క్ యాప్ ఉపయోగించాం. ఫోన్ యొక్క ప్రాసెసర్ పై ఈ యాప్ స్ట్రెస్ టెస్ట్ రన్ చేసి, పెర్ఫామెన్స్ ఔట్‌పుట్‌ను బట్టి స్కోర్ ఇస్తుంది.
Vivo V40 ఈ టెస్ట్ లో 68.8 పర్సెంట్ ఔట్‌పుట్ ఇచ్చింది. మరోవైపు OnePlus 12R 70 శాతం ఔట్‌పుట్ ఇచ్చింది. ఈ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను బట్టి, వివో వీ40 మరియు వన్‌ప్లస్ 12ఆర్ రెండూ కూడా సమ ఉజ్జీలుగా నిలిచాయి.
విజేత: రెండూ సమానం
గేమింగ్ టెస్ట్
మేం బీజీఎంఐ, సీఓడీ: మొబైల్, రియల్ రేసింగ్ 3 గేమ్‌లను రెండు ఫోన్లలో 30 నిమిషాల పాటు ఆడాం. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ వంటి గేమ్స్‌ను రెండు ఫోన్లు కూడా బాగా హ్యాండిల్ చేశాయి. హై గ్రాఫిక్ రెజుల్యూషన్ సెట్టింగ్స్‌తో OnePlus 12R, Vivo V40 తో పోల్చితే బెటర్ యావరేజ్ ఎఫ్‌పీఎస్ డెలివరీ చేసింది. ఇందుకు వన్‌ప్లస్ 12ఆర్ లో ఉన్న శక్తివంతమైన జీపీయూకి థాంక్స్ చెప్పుకోవాలి.
థర్మల్స్ విషయంలో, Vivo V40 ప్రతీ గేమ్ లో కూడా 4.13 డిగ్రీ సెల్సియస్ యావరేజ్ టెంపరేచర్ ప్రొడ్యూస్ చేసింది. మరోవైపు, OnePlus 12R యావరేజ్ టెంపరేచర్ 5.53 డిగ్రీ సెల్సియస్ కి పెరిగింది. వన్‌ప్లస్ 12ఆర్ కంటే వివో వీ40 కూల్ గా ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్ యొక్క జీవితకాలాన్ని పెంచుతుంది. అయినప్పటికీ, గేమింగ్ విషయంలో OnePlus 12R తన సుపీరియర్ పెర్ఫామెన్స్‌తో విన్నర్ గా నిలిచింది.
ఏది బెటర్?
టెస్ట్ ఫలితాలను బట్టి, OnePlus 12R స్మార్ట్‌ఫోన్ Vivo V40 కంటే మెరుగైన పెర్ఫామెన్స్ చేస్తోందని అర్థమవుతోంది. బెటర్ బెంచ్‌మార్క్ స్కోర్స్ కలిగి ఉండటంతోపాటు, ఉత్తమమైన గేమింగ్ పెర్ఫామెన్స్ ను వన్‌ప్లస్ 12ఆర్ చూపింది. థర్మల్ మేనేజ్మెంట్ విషయంలో OnePlus 12R తో పోల్చితే Vivo V40 బెటర్ గా ఉంది. మీరు గనుక, రూ.40,000 లోపు ధరలో గ్రేట్ పెర్ఫామెన్స్ ఇచ్చే స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే, ఈ రెండింట్లో OnePlus 12R బెటర్ ఛాయిస్ అని చెప్పవచ్చు.













