Google Pixel 9 Series: భారత్‌లో లాంచైన Pixel 9, Pixel 9 Pro, Pixel 9 Pro XL

Highlights

  • భారత్‌లో Google Pixel 9 సిరీస్ లాంచ్
  • లైనప్ లో వచ్చిన పిక్సెల్ 9, 9 ప్రో, 9 ప్రో ఎక్స్ఎల్
  • వీటితో పాటు లాంచైన పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్

ప్రముఖ టెక్ కంపెనీ Google నేడు భారత్ తో సహా గ్లోబల్‌గా తన Pixel 9 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Google Pixel 9, Google Pixel 9 Pro, Google Pixel 9 Pro XL మరియు Google Pixel 9 Pro Fold అనే నాలుగు స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లు ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఏఐ టెక్నాలజీతో వచ్చాయి. అంతేకాదు, గ్రేట్ కెమెరా ఎక్స్‌పీరియన్స్, పెర్ఫామెన్స్, సుదీర్ఘ బ్యాటరీ మరియు స్మూథ్ ఆండ్రాయిడ్ అనుభూతిని ఈ ఫోన్లలో అందించారు. ఈ ఆర్టికల్ లో మనం గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో మరియు పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ల యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Google Pixel 9 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Google Pixel 9 లో 6.3-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 20:0 యాస్పెక్ట్ రేషియో, 1080*2424 పిక్సెల్స్ రెజుల్యూషన్, 422 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ ఆడాప్టివ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, 1800 నిట్స్ బ్రైట్నెస్, 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: Google Pixel 9 లో గూగుల్ టెన్సర్ జీ4 చిప్సెట్ వాడారు. దీనికి తోడు టైటాన్ ఎమ్2 చిప్ ను భద్రత కోసం అందించారు.

ర్యామ్, స్టోరేజీ: Google Pixel 9 డివైజ్ 128జిబి/256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Google Pixel 9 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 10.5ఎంపి డ్యూయల్ పీడీ సెల్ఫీ కెమెరా అందించారు.

బ్యాటరీ: Google Pixel 9 లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Google Pixel 9 లో గూగుల్ వీపీఎన్, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, అడ్మీ, మ్యాక్రో ఫోకస్, ఫేస్ అన్‌బ్లర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్, ఫేస్ అన్‌లాక్, శాటిలైట్ ఎస్ఓఎస్, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

Google Pixel 9 Pro, Pixel 9 Pro XL స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Google Pixel 9 Pro లో 6.3-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంది. Pixel 9 Pro XL లో 6.8-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్ ఇచ్చారు. రెండు మోడల్స్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 1080*2424 పిక్సెల్ రెజుల్యూషన్, 422 పీపీఐ స్మూథ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, 1800 నిట్స్ బ్రైట్నెస్, 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,000,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.

చిప్సెట్: ఈ రెండు ఫోన్లలో గూగుల్ టెన్సర్ జీ4 ప్రాసెసర్ వాడారు. దీనికి తోడు టైటాన్ ఎమ్2 చిప్‌ను భద్రత కోసం అందించారు.

స్టోరేజీ: Google Pixel 9 Pro మరియు Google Pixel 9 Pro XL డివైజెస్ 128జిబి/256జిబి/512జిబి మరియు 1టిబి స్టోరేజీ, 16జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

రియర్ కెమెరా: Google Pixel 9 Pro, Google Pixel 9 Pro XL డివైజెస్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి వైడ్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ మ్యాక్రో ఫోకస్ లెన్స్ మరియు 48ఎంపి 5ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. టెలీఫోటో లెన్స్ 30ఎక్స్ వరకు సూపర్ రెజ్ జూమ్, 0.5ఎక్స్, 1ఎక్స్, 2ఎక్స్, 5ఎక్స్, 10ఎక్స్ ఆప్టికల్ క్వాలిటీ అందిస్తుంది.

ఫ్రంట్ కెమెరా: ఈ రెండు ఫోన్లలో 42ఎంపి డ్యూయల్ పీడీ సెల్ఫీ కెమెరా అందించారు. ఈ సెన్సర్ ఆటోఫోకస్, ఎఫ్/2.2 అపర్చర్, 103 డిగ్రీ అల్ట్రావైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ లను కలిగి ఉంది.

బ్యాటరీ: Google Pixel 9 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. మరోవైపు, Google Pixel 9 Pro XL లో పవర్ బ్యాకప్ కోసం 5060 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. రెండు ఫోన్లు కూడా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చాయి.

సాఫ్ట్‌వేర్: Google Pixel 9 Pro మరియు Google Pixel 9 Pro XL డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యాయి. అన్ని వేరియంట్లు 7 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ మరియు పిక్సెల్ డ్రాప్ అప్డేట్స్ పొందుతాయి.

Google Pixel 9 సిరీస్ ధర

Google Pixel 9 ప్రారంభ ధర రూ.79,999 గా ఉంది. ఒబ్సిడియన్, పార్సెలెన్, వింటర్‌గ్రీన్ మరియు ఫ్యూనీ కలర్స్ లో లభిస్తుంది.

Google Pixel 9 Pro ప్రారంభ ధరను రూ.1,09,999 గా నిర్ణయించారు. Google Pixel 9 Pro XL ధరను రూ.1,24,999 గా పెట్టారు. ఒబ్సిడియన్, పార్సెలెన్, హేజల్ మరియు రోజ్ క్వార్ట్జ్ కలర్స్ లో ఈ ఫోన్లు లభిస్తాయి.

Google Pixel 9 మరియు Google Pixel 9 Pro XL ఫోన్ల యొక్క ప్రీ-ఆర్డర్స్ రేపటి నుంచి మొదలవుతాయి. భారత్ లోని ఫ్లిప్‌కార్ట్ మరియు రిటైల్ పార్ట్నర్స్ ద్వారా ఈ ఫోన్లు విక్రయించబడతాయి. ఆగస్టు 22 నుంచి సేల్ మొదలవుతుంది.