
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎస్24 సిరీస్ లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. Samsung Galaxy S24 FE పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవలె ఈ డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.
Samsung Galaxy S24 FE లాంచ్ టైమ్‌లైన్ (లీక్)
Samsung Galaxy S24 FE యొక్క లాంచ్ టైమ్‌లైన్ వివరాలను ETNews తన కథనంలో పేర్కొంది. 2024 అక్టోబర్ నెలలో ఈ ఫోన్ లాంచ్ కానుందని ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఈ లాంచ్ టైమ్ సరైనదని అనిపిస్తోంది. ఎందుకంటే, Galaxy S23 FE కూడా ఇదే టైమ్ లో లాంచ్ అయ్యింది.
Samsung Galaxy S24 FE స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ భారీ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంటాయని లీక్ ద్వారా తెలిసింది.
చిప్సెట్: Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ సొంత చిప్ ఎగ్జినోస్ 2400 తో రానుందని సమాచారం. ఇదే చిప్‌ని గెలాక్సీ ఎస్24 మరియు ఎస్24+ లో కూడా వాడారు.
కెమెరా: Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: Samsung Galaxy S24 FE లో పవర్ బ్యాకప్ కోసం 4565 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ, 29 గంటల వీడియో ప్లేబ్యాక్ మరియు 78 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుందని సమాచారం.
ఇతర ఫీచర్లు: Samsung Galaxy S24 FE డివైజ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లతో వస్తోంది. ఇందులో పొట్రెయిట్ స్టూడియో, సర్కిల్ టు సెర్చ్, జనరేటివ్ ఎడిట్, స్కెచ్ టు ఇమేజ్ మరియు లైవ్ ట్రాన్స్‌లేట్ వంటి ఫీచర్లు ఉంటాయి.











