
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నేడు భారతీయ మార్కెట్లో Z9s సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iQOO Z9s మరియు iQOO Z9s Pro అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం iQOO Z9s Pro గురించి తెలుసుకుందాం. iQOO Z9s కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక iQOO Z9s Pro విషయానికి వస్తే, ఇందులో 256జిబి స్టోరేజీ, కర్వ్డ్ డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉన్నాయి. ఓసారి ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
iQOO Z9s Pro ధర, లభ్యత
iQOO Z9s Pro డివైజ్ 3 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.24,999 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.26,999 గా నిర్ణయించారు.
12జిబి ర్యామ్ + 256జిబ స్టోరేజీ టాప్ వేరియంట్ ధరను రూ.28,999 గా నిర్ణయించారు.
లక్స్ మార్బుల్ మరియు ఫ్లాంబయాంట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఇవి వీగన్ లెదర్ బ్యాక్ ఫినిష్ తో ఉంటాయి.
iQOO Z9s Pro డివైజ్ సేల్ ఆగస్టు 23 నుంచి మొదలవుతుంది. అమెజాన్ మరియు ఐకూ ఆన్లైన్ స్టోర్ ద్వారా కొననుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ మరియు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్స్ పై రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.3,000 ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది.
iQOO Z9s Pro స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: iQOO Z9s Pro లో 6.77-ఇంచ్ కర్వ్డ్ స్క్రీన్, 2392*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1 బిలియన్ కలర్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, వెట్ టచ్ టెక్నాలజీ ఉన్నాయి.
ప్రాసెసర్: iQOO Z9s Pro క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.63 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ అందించారు.
మెమొరీ: iQOO Z9s Pro డివైజ్ 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 8జిబి+128జిబి, 8జిబి+256జిబి మరియు 12జిబి+256జిబి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ వల్లన 12జిబి వరకు ర్యామ్ పవర్ యూజర్‌కి లభిస్తుంది.
కెమెరా: iQOO Z9s Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి శాంసంగ్ S5K3P9SP04-FGX9 సెన్సర్ ఇచ్చారు.
బ్యాటరీ, చార్జింగ్: iQOO Z9s Pro లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ 4 ఏళ్ళ పాటు పని చేస్తుందని కంపెనీ చెబుతోంది. 4 ఏళ్ళ పాటు ప్రతీరోజూ చార్జ్ చేస్తుంటే, ఆ తర్వాత 80 శాతం బ్యాటరీ నిరవధికంగా లభిస్తుందని ఐకూ అంటోంది.
సాఫ్ట్వేర్: iQOO Z9s Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
ఇతర ఫీచర్లు: iQOO Z9s Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, అల్ట్రా గేమింగ్ మోడ్, 4డీ గేమ్ వైబ్రేషన్, ఏఐ ఫోటో ఎన్హాన్స్, ఏఐ ఎరేజ్, ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టంట్ రేటింగ్ ఉన్నాయి.











