
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి వచ్చే ఫోన్లకు భారత్ లో మంచి గిరాకీ ఉంటుంది. తాజాగా Redmi Note 13 5G సిరీస్ లోని అన్ని ఫోన్లపై సదరు కంపెనీ బ్యాంక్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సిరీస్ లోని మూడు మోడల్స్ పై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో లాంచ్ ధర కంటే తక్కువకే ఫోన్లను సొంతం చేసుకునే అవకాశం యూజర్లకు లభిస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Redmi Note 13 5G ఆఫర్లు మరియు ధర
Redmi Note 13 5G సిరీస్ లోని బేస్ మోడల్ Redmi Note 13 5G పై ఐసీఐసీఐ బ్యాంక్ మరియు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.1,000 లభించనుంది.
6జిబి+128జిబి వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా, బ్యాంక్ ఆఫర్ తర్వాత ఇది రూ.12,999 కి లభించనుంది.
8జిబి+128జిబి వేరియంట్ అసలు ధర రూ.15,499 కాగా, బ్యాంక్ ఆఫర్ తర్వాత ఇది రూ.14,499 కి లభించనుంది.
Redmi Note 13 Pro ఆఫర్లు మరియు ధర
Redmi Note 13 Pro ఫోన్ ప్రారంభ ధర రూ.21,999 గా ఉంది. ఐసీఐసీఐ మరియు ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై రూ.3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.3,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ అసలు ధర రూ.24,999 గా ఉంది. ఆఫర్ ధర రూ.21,999 గా ఉంది.
8జిబి+256జిబి వేరియంట్ అసలు ధర రూ.26,999 గా ఉంది. ఆఫర్ ధర రూ.23,999 గా ఉంది.
12జిబి+256జిబి వేరియంట్ అసలు ధర రూ.27,999 గా ఉంది. ఆఫర్ ధర రూ.24,999 గా ఉంది.
Redmi Note 13 Pro Plus ఆఫర్లు మరియు ధర
Redmi Note 13 Pro Plus పై రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తోంది. ఐసీఐసీఐ మరియు ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులు ఈ ఆఫర్ పొందవచ్చు. అంతేకాదు, రూ.3,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. దీని ద్వారా ఫోన్ ధర మరింత తగ్గనుంది.
8జిబి+256జిబి వేరియంట్ అసలు ధర రూ.29,499 గా ఉంది. ఆఫర్ ధర రూ.26,499 గా ఉంది. 12జిబి+256జిబి మోడల్ అసలు ధర రూ.31,499 గా ఉంది. ఆఫర్ ధర రూ.28,499 గా ఉంది. 12జిబి+512జిబి వేరియంట్ అసలు ధర రూ.33,499 గా ఉంది. ఆఫర్ ధర రూ.30,499 గా ఉంది.
పైన తెలిపిన ఆఫర్లను తెలుసుకునేందుకు ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి.











