
ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు స్మార్ట్‌ఫోన్ లేకుంటే దాదాపు ఏ పని కూడా జరగని పరిస్థితి ఉంది. కానీ వాటి వాడకాన్ని బట్టి, ఎక్కువ సేపు బ్యాటరీ బ్యాకప్ అందించలేవు. అలాంటి సమయంలోనే, అవసరానికి ఆదుకునే సెకండరీ ఫోన్ కూడా ఉంటే బాగుండనిపిస్తుంది. అందుకే మీకోసం Nokia 105 డిస్కౌంట్ ఆఫర్ తో వచ్చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
Nokia 105 ధర, ఆఫర్లు మరియు లభ్యత
Nokia 105 ఫీచర్ ఫోన్ ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై 37 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ఇప్పుడు రూ.1,065 కే లభిస్తుంది.
ఈ డిస్కౌంట్ తో పాటు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
Nokia 105 ఫోన్ యొక్క పాత ధర రూ.1,699 గా ఉంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వెబ్‌సైట్ పై ఇంకా రూ.1,199 కే విక్రయించబడుతోంది.
Nokia 105 పాత ధర రూ.1,699 గా ఉంది. కంపెనీ వెబ్‌సైట్ లో ధర రూ.1,199 గా ఉంది. డిస్కౌంట్ ధర రూ.1,065 గా ఉంది.

Nokia 105 స్పెసిఫికేషన్స్
Nokia 105 ఫీచర్ ఫోన్ లో 1.8-ఇంచ్ క్యూవీజీఏ స్క్రీన్ ఉంటుంది. ఈ మొబైల్ ఎస్30+ ఓఎస్ పై పని చేస్తుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 1,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఈ నోకియా ఫోన్ ని ఒక్కసారి చార్జ్ చేస్తే, కొన్ని రోజులపాటు వాడుకోవచ్చు. ఈ ఫోన్ లో వైర్లెస్ ఎఫ్ఎమ్ రేడియో, టార్చ్ లైట్ వంటి ఫీచర్లు అందించారు.











