
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix నేడు భారతీయ మార్కెట్ లో హాట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Hot 50 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదలైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 48ఎంపి ఏఐ కెమెరా, 16జిబి వరకు ర్యామ్ ఈ ఫోన్ లో అందించారు. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Infinix Hot 50 5G ధర, సేల్ వివరాలు
Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం.
4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.9,999 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.10,999 గా నిర్ణయించారు.
బ్యాంక్ ఆఫర్ లో భాగంగా రూ.1,000 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.
Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ స్లీక్ బ్లాక్, వైబ్రంట్ బ్లూ, సేజ్ గ్రీన్ మరియు డ్రీమీ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు.
Infinix Hot 50 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 60Hz, 90Hz, 120Hz రిఫ్రెష్ రేట్స్, 93.9 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Infinix Hot 50 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.
ర్యామ్, స్టోరేజీ: Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. 8జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్ తో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
కెమెరా: Infinix Hot 50 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి సోని ఐఎంఎక్స్582 ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ముందువైపు కూడా ఫ్లాష్ అందించారు.
బ్యాటరీ, చార్జింగ్: Infinix Hot 50 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్వేర్: Infinix Hot 50 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: Infinix Hot 50 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Infinix Hot 50 5G లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా డైనమిక్ బార్ ఇంటరాక్టివ్ స్క్రీన్ ఫీచర్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్ సెగ్మెంట్-ఫస్ట్ టీయూవీ ఎస్‌యూడీ ఏ లెవెల్ 60-మంత్ ఫ్లూయెన్సీ అస్యూరెన్స్ తో వచ్చింది. ఐదేళ్ళ పాటు ఈ ఫోన్ నిలకడగా పని చేస్తుందని దీనర్థం.











