
రిలయన్స్ జియో తాజాగా భారతీయ మార్కెట్ లో ఒక కొత్త చవకైన 4జీ ఫోన్ని లాంచ్ చేసింది. JioPhone Prima 2 4G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గతంలో వచ్చిన JioPhone Prima కి సక్సెసర్ గా ప్రైమా 2 4జీ విడుదలైంది. ప్రైమా 2 డిజైన్ విషయానికి వస్తే, కొత్త కర్వ్డ్ డిజైన్, లెదర్-లైక్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ తో వచ్చింది. సరే, ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
JioPhone Prima 2 4G ధర, సేల్, కలర్ ఆప్షన్స్
JioPhone Prima 2 4G ఫీచర్ ఫోన్ ధరను రూ.2,799 గా పెట్టారు. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంది. లక్స్ బ్లూ సింగిల్ కలర్ వేరియంట్ లో ఈ ఫోన్ లభిస్తుంది. త్వరలోనే ఈ డివైజ్ జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
JioPhone Prima 2 4G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
డిస్ప్లే: JioPhone Prima 2 4G లో 2.4-ఇంచ్ క్యూవీజీఏ కర్వ్డ్ స్క్రీన్, 320*240 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్ఈడీ టార్చ్ ఉన్నాయి.
కెమెరా: JioPhone Prima 2 4G లో 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాక్ ప్యానెల్ పై వీజీఏ కెమెరా అందించారు.
ర్యామ్, స్టోరేజీ: JioPhone Prima 2 4G డివైజ్ 512ఎంబి ర్యామ్ తో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 128జిబి వరకు పెంచుకునే వీలుంది.
ప్రాసెసర్: JioPhone Prima 2 4G డివైజ్ లో ఏఆర్ఎమ్ కార్టెక్స్ ఏ53 చిప్సెట్ వాడారు.
సాఫ్ట్వేర్: JioPhone Prima 2 4G ఫీచర్ ఫోనన్ లో kaiOS 2.5.3 ఓఎస్ ను అందించారు.
బ్యాటరీ: JioPhone Prima 2 4G లో పవర్ బ్యాకప్ కోసం 2000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఇచ్చారు.
ఫీచర్లు: JioPhone Prima 2 4G లో యూపీఐ పేమెంట్ ఆప్షన్ ఉంది. జియోపే ద్వారా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. ఇంకా ఈ ఫోన్ లో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లు ఉన్నాయి.
JioPhone Prima 2 4G డివైజ్ లో వినోదం కోసం ఎఫ్ఎమ్ రేడియో అందించారు. ఇంకా ఈ ఫోన్ 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది.
ఇవే కాకుండా, జియోటీవీ, జియోసినిమా, జియోసావన్ మరియు మరెన్నో ఇతర ఎంటర్టెయిన్మెంట్ యాప్స్ ఈ ఫోన్ లో లభిస్తాయి. జియోచాట్ కోసం రియర్ మరియు ఫ్రంట్ కెమెరాలు ఉపయోగపడుతాయి. అలాగే ఎటువంటి యాప్స్ అవసరం లేకుండా నేటివ్ వీడియో కాలింగ్ ఫీచర్ను ఈ ఫోన్ లో అందించారు.
చాలా తక్కువ బడ్జెట్ లో యూట్యూబ్, ఫేస్బుక్, వీడియో కాలింగ్, యూపీఐ వంటి ఫీచర్లు గల 4జీ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ జియో ఫోన్ చక్కటి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.












