
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno తన స్పార్క్ సిరీస్ లో కొత్త ఫోన్‌ని గ్లోబల్‌గా లాంచ్ చేసింది. Tecno Spark 30C పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. తక్కువ ధరలో ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి ఇదొక మంచి ఆప్షన్ అవ్వవొచ్చు. ఈ ఫోన్ లో 50ఎంపి కెమెరా, 16జిబి వరకు ర్యామ్ పవర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. సరే, ఓసారి ఈ డివైజ్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Tecno Spark 30C ధర, సేల్ వివరాలు
Tecno Spark 30C స్మార్ట్‌ఫోన్ 4 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ.
Tecno Spark 30C స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Tecno Spark 30C లో 6.67-ఇంచ్ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Tecno Spark 30C లో మీడియాటెక్ హీలియో జీ81 చిప్సెట్ వాడారు. ఈ చిప్ టాస్కులను స్మూథ్ గా ఆపరేట్ చేస్తుంది.
ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 30C డివైజ్ 4 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ. 16జిబి వరకు ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ఈ ఫోన్ లో అందించారు.
కెమెరా: Tecno Spark 30C లో 50ఎంపి మెయిన్ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ముందువైపు కూడా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ అందించారు.
బ్యాటరీ, చార్జింగ్: Tecno Spark 30C లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Tecno Spark 30C స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.
కనెక్టివిటీ: Tecno Spark 30C లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Tecno Spark 30C లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డీటీఎస్ సౌండ్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.











