
ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో బ్లేజ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Lava Blaze 3 5G పేరుతో ఈ ఫోన్ రానుంది. తాజాగా ఇండియా లాంచ్‌ని కంపెనీ టీజర్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. గత మోడల్ బ్లేజ్ 2 కి సక్సెసర్‌గా Lava Blaze 3 5G విడుదల కానుంది. సరే, ఓసారి ఈ ఫోన్ యొక్క టీజర్ వివరాలు తెలుసుకుందాం.
Lava Blaze 3 5G ఇండియా లాంచ్ ఖరారు
Lava Blaze 3 5G స్మార్ట్‌ఫోన్ యొక్క టీజర్‌ను సోషల్ మీడియా సైట్ X పై లావా సంస్థ షేర్ చేసింది.
ప్రస్తుతం Lava Blaze 3 5G ఫోన్‌ని కమింగ్ సూన్ అని కంపెనీ లిస్ట్ చేసింది. ఇదే నెలలో లావా బ్లేస్ 3 5జీ లాంచ్ అవుతుందని సమాచారం.
టీజర్ వీడియోను గమనిస్తే, ఈ ఫోన్ అప్‌గ్రేడెడ్ కెమెరా మాడ్యూల్ తో వస్తుందని తెలుస్తోంది.
ఈ ఫోన్ లో కొత్తగా వైబ్ లైట్ ఎల్ఈడీ ఫ్లాష్ ను బ్యాక్ ప్యానెల్ పై కెమెరా మాడ్యూల్ పక్కన అందించనున్నారు. దీని వల్లన నైట్ ఫోటోగ్రఫీ మెరుగవుతుంది.
Lava Blaze 3 5G యొక్క లాంచ్ తేదీ మరియు ఇతర వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఇప్పుడు గత మోడల్ Lava Blaze 2 5G యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Glow all you want, we’re setting the VIBE!#Blaze35G – Coming Soon#LavaMobile #ProudlyIndian pic.twitter.com/tOcNkNtKnA
— Lava Mobiles (@LavaMobile) September 10, 2024
Lava Blaze 2 5G స్పెసిఫికేషన్స్
స్క్రీన్: Lava Blaze 2 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, పంచ్-హోల్ స్టైల్ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 270 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Lava Blaze 2 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ వాడారు. ఇది 7 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వాడారు.
మెమొరీ: Lava Blaze 2 5G లో 4జిబి/6జిబి ర్యామ్, 4జిబి/6జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 మెమొరీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు.
సాఫ్ట్వేర్: Lava Blaze 2 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఓఎస్ కాబట్టి అవసరంలేని యాప్స్, బ్లోట్‌వేర్ ఫోన్ లో ఉండవు.
కెమెరా: Lava Blaze 2 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Lava Blaze 2 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
భద్రత: Lava Blaze 2 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
ఇతర ఫీచర్లు: Lava Blaze 2 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఈ డివైజ్ 203 గ్రాముల బరువు, 8.9 మి.మీ మందం ఉంటుంది.











