Honor 200 Lite 5G ఇండియా లాంచ్ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • త్వరలో Honor 200 Lite 5G లాంచ్
  • తాజాగా ఇండియా లాంచ్ ఖరారు
  • ఎక్స్ ద్వారా ప్రకటించిన హానర్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor త్వరలో తన 200 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Honor 200 Lite 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్‌ను కంపెనీ తన ఎక్స్ ఖాతా ద్వారా కన్ఫర్మ్ చేసింది. మరొక లీక్ ద్వారా ఈ ఫోన్ యొక్క భారతీయ మార్కెట్ ధర కూడా రివీల్ అయ్యింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.

Honor 200 Lite 5G భారత్ లాంచ్ ఖరారు

Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను హానర్ సంస్థ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X ద్వారా ఖరారు చేసింది.

తన పోస్ట్ ద్వారా షేర్ చేసిన వీడియోలో Honor 200 Lite 5G పేరును కంపెనీ పేర్కొంది.

Honor 200 Lite 5G డివైజ్ గ్రేట్ సెల్ఫీస్, పర్ఫెక్ట్ పొట్రెయిట్ ఫోటోలను తీస్తుందని కంపెనీ పేర్కొంది.

అయితే, Honor 200 Lite 5G యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. త్వరలోనే లాంచ్ తేదీ వెల్లడయ్యే అవకాశం ఉంది.

Honor 200 Lite 5G ధర (లీక్)

Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ నెలలో భారత్ లో లాంచ్ అవుతుందని ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తన X ఖాతా ద్వారా తెలియజేశారు.

Honor 200 Lite 5G యొక్క భారత మార్కెట్ ధర రూ.25,000 లోపు ఉంటుందని ముకుల్ అంచనా వేశారు.

Honor 200 Lite 5G డివైజ్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Honor 200 Lite 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: Honor 200 Lite 5G లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 1080*2412 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3240 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 10-బిట్ కలర్స్ ఉన్నాయి.

చిప్సెట్: Honor 200 Lite 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టా-కోర్ చిప్సెట్ ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Honor 200 Lite 5G డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీతో వచ్చింది.

కెమెరా: Honor 200 Lite 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Honor 200 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Honor 200 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ లో 5జీ, వై-ఫై 5, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.1, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.